
అచ్చంపేట, డిసెంబర్ 25 : తీన్మార్ మల్లన్న వ్యవహారశైలి మార్చుకోకపోతే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు హెచ్చరించారు. శనివారం నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడా రు. మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షుపై మల్లన్న మాటతీరు సరికాదన్నా రు. సమాజం సిగ్గుపడే విధంగా రాష్ట్రంలోని బీజేపీ నేతల తీరు ఉండడం బాధాకరమన్నారు. ఈ వ్యాఖ్యలు వారి పరాకాష్టకు నిదర్శనమని ధ్వజమెత్తారు. పా ఠశాల విద్యార్థి అని కూడా చూడకుండా రాజకీయంలోకి లాగడం సరికాదన్నా రు. బీజేపీ అధిష్టానం నేర్పిస్తున్నది ఇదేనా అని ప్రశ్నించారు. రాజకీయాల్లో కుటుం బ సభ్యులు, వ్యవహారాలు తీసుకురావద్దని హితవు పలికారు. మాకు మాట్లాడ డం రాదని కాదు.. ప్రజాస్వామ్యబద్ధం గా నడుచుకునే విధానం టీఆర్ఎస్ నా యకులకు ఉన్నదన్నారు. వెంటనే తీ న్మార్ మల్లన్న రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో అసభ్యకరమైన, వక్రీకరించే మాటలు, సంస్కృతిని ప్రేరేపించడం బీజేపీ, కాంగ్రెస్‌కు అలవాటు గా మారిందని విమర్శించారు. వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ రాజకీయ విలువలను భ్రష్టు పట్టించే విధంగా వా రి తీరు కొనసాగుతున్నదని ధ్వజమెత్తా రు. యూట్యూబ్ చానళ్లలో అవసరం లే ని వీడియోలు చూపిస్తూ వివాదాల్లోకి లాగుతున్నారని దుమ్మెత్తిపోశారు. పీసీసీ చీఫ్ రేవంత్ కూడా హిమాన్షుపై ఆరోపణలు చేయడం తగదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మరో 20 ఏండ్లు రాష్ట్రంలో అధికారంలో ఉండడం ఖాయమని ధీ మా వ్యక్తం చేశారు. అచ్చంపేట అడ్డపై మరోసారి గులాబీ జెండా ఎగురుతుందన్నారు. సమావేశంలో మున్సిపల్ చై ర్మన్ నర్సింహాగౌడ్, జెడ్పీటీసీ రాం బాబు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ప ర్వతాలు, పట్టణ అధ్యక్షుడు రమేశ్, కౌ న్సిలర్లు, నాయకులు శివ, రమేశ్, శ్రీను, మన్ను పటేల్, రాజేశ్వర్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, లోక్యానాయక్, ప్రతాప్‌రెడ్డి, వెంకటయ్య, వంశీ, తిరుపతి యాదవ్, హు స్సేన్, పరమేశ్వర్, వెంకటేశ్ ఉన్నారు.