సర్వే రిపోర్ట్ కోసం రూ.40వేలు డిమాండ్
రూ.10వేలు తీసుకుంటూ హన్మకొండలో పట్టుబడిన రాములు
ఏకకాలంలో హన్మకొండ, పరకాల, చిట్యాలలో సోదాలు
చిట్యాల/ హన్మకొండ సిటీ, జూన్ 25 : భూమి సర్వే రిపోర్ట్ కోసం డబ్బులు డిమాండ్ చేసిన డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ ల్యాండ్ సర్వేయర్ రాములు ఏసీబీకి చిక్కారు. రైతు నుంచి రూ.10వేలు లంచం తీసుకుంటుండగా శుక్రవారం హైదరాబాద్ ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం జూకల్ గ్రామానికి చెందిన రావుల సాయిరెడ్డికి గ్రామ శివారులోని సర్వే నంబర్ 22, 23, 24లలో మొత్తం 6.37 ఎకరాల సాగుభూమి వారసత్వంగా ఉంది. రికార్డు ప్రకారం ఉన్న భూమి కాస్తులో లేదని గత పదేళ్లుగా రెవెన్యూ అధికారుల చుట్ట్టూ తిరుగుతున్నారన్నాడు. అతడి కుమారుడు శ్రావణ్‌కుమార్‌రెడ్డి భూ సర్వే కోసం మీసేవలో ఎఫ్‌లైన్(ఎంసీ) దరఖాస్తు చేశాడు. చిట్యాల సర్వేయర్ పావని, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ రా ములు 15రోజుల క్రితం సర్వే చేశారు. అయితే సర్వే రిపోర్ట్ కోసం వెళ్తే రూ.40వేలు డిమాండ్ చేశారు. దీం తో వారు హైదరాబాద్‌లోని ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పథకం ప్రకారం శుక్రవారం శ్రావణ్‌కుమార్‌రెడ్డి హన్మకొండ గోపాలపురంలోని శ్రీనివాస్ నగర్ కాలనీలో ఉంటున్న రాములు ఇంటికి వెళ్లి రూ.10వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అలాగే సర్వేయర్ పావనికి సంబంధించి పరకాలలోని ఆమె ఇంట్లోనూ సోదాలు చేశారు. అయితే ఎలాంటి ఫైల్స్ దొరకలేదు. చిట్యాల తహసీల్దార్ కార్యాలయంలో సో దాలు చేసి సర్వే రికార్డులను స్వాధీనం చేసుకున్నా రు. ఈ సందర్భంగా వారిపై కేసు నమోదు చేసి దర్యా ప్తు చేస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ సతీశ్ తెలిపారు. సోదాల్లో ఏసీ బీ ఇన్స్పెక్టర్లు రవి, శ్రీనివాస్ పాల్గొన్నారు.