మహాముత్తారం, డిసెంబర్ 24: నిరుపేదలకు సీఎం రీలీఫ్ ఫండ్ ఎంతగానో ఉపయోగపడుతోందని తెలంగాణ వెంకటేశ్వర్రావు అన్నారు. శుక్రవారం మండలంలోని పోలారం గ్రామానికి చెందిన వేల్పుల అర్జయ్యకు మంజూరైన రూ.లక్ష 80 వేల విలువైన చెక్కును లబ్ధిదారుడికి అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు అంబాల రాజబాబు, గ్రామ శాఖ అధ్యక్షులు ముక్కేర శ్రీకాంత్, సింగిల్‌విండో డైరెక్టర్ వేల్పుల సమ్మక్క, ఉపసర్పంచ్ ఎర్రోళ్ల బాపు, గ్రామ రైతుబంధు అధ్యక్షుడు శంకర్, వార్డ సభ్యుడు సమ్మయ్య, నాయకులు పోచయ్య, మనోహర్, సంతోష్ రవి తదితరులు పాల్గొన్నారు.
మంగపేటలో…
మంగపేట, డిసెంబర్ 24: మంగపేట మండలంలోని ఆయా గ్రామాల 75 మంది లబ్ధిదారులకు శుక్రవారం తహసీల్దార్ బాబ్జీ ప్రసాద్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సీతక్క, రైతు సేవా సహకార సంఘం చైర్మన్ తోట రమేష్‌తో కలిసి కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చెక్కులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సహకార సంఘం చైర్మన్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం పేదింటి పెళ్లికి చేయూతను అందించాలని సంకల్పించి ఈబృహత్తర పథకాన్ని కొనసాగిస్తూ తెలంగాణ రాష్ర్టాన్ని దేశంలోనే ఆదర్శంగా నిలిపినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐలు కామేశ్వర్రావు, సునిల్, ఎంపీవో శ్రీకాంత్, వీఆర్వోలు పాల్గొన్నారు.
మహదేవపూర్‌లో…
మహదేవపూర్, డిసెంబర్ 24: మహదేవపూర్ మండల కేద్రంలో ఉన్న ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం మంథని ఎమ్మెల్యే శ్రీదర్‌బాబు కల్యాణ లక్ష్మీచెక్కుల పంపిణి చేశారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 40 మంది కల్యాణలక్ష్మీ చెక్కుల పంపిణీ చేశారు. ఈ కార్య క్రమంలో ఎంపీపీ రాణిబాయి, జడ్పీటీసీ అరుణ, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో శంకర్ ఉన్నారు.
కల్యాణలక్ష్మీ చెక్కులు, క్రిస్మస్ గిఫ్ట్ పంపిణీ
ఏటూరునాగారం, డిసెంబర్ 24: మండల కేంద్రంలో కల్యాణలక్ష్మీ చెక్కులు, క్రిస్మస్ కిట్స్‌ను శుక్రవారం తహసీ ల్దార్ రవీందర్, జడ్పీ కో ఆప్షన్ సభ్యురాలు వలియాబీ పంపిణీ చేశారు. మండలానికి మంజూరైన నాలుగు కల్యాణలక్ష్మీ చెక్కులతో పాటు క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రభుత్వం సరఫరా చేసిన కిట్స్‌ను మండల కేంద్రంలోని క్రాస్ రోడ్డు ప్రాంతంలోని చర్చిలో పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యురాలు శ్రీలత, చర్చి ఫాదర్లు పాల్గొన్నారు.
25 కల్యాణ లక్ష్మీ చెక్కులు మంజూరు
మల్హర్, డిసెంబర్ 24: రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద ఆడపిల్లల వివాహాలకు చేయూత అందించడం కోసం ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మీ పథకం ద్వారా మల్హర్ మండలానికి 25 చెక్కులు మంజూరైనట్లు మండల తహసీల్దార్ శ్రీనివాస్ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. మండలంలోని ఆయా గ్రామాల్లో లబ్ధిదారులకు ఈ చెక్కులను పంపిణీ చేయనున్నట్లు ఆయన తెలిపారు.