షాబాద్, డిసెంబర్ 22 : విద్యార్థులు గణిత మేధావి శ్రీనివాస రామానుజన్‌ను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని షాబాద్ కేజీబీవీ పాఠశాల ప్రత్యేకాధికారి కృష్ణకుమారి అన్నారు. బుధవారం జాతీయ గణిత దినోత్సవాన్ని పురస్కరించుకుని షాబాద్ మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో ఉపాధ్యాయులతో కలిసి రామానుజన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాలర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు గణితాన్ని ఇష్టంగా నేర్చుకుని గణిత మేధావులుగా తయారు కావాలని సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు వనిత, కనకదుర్గ, స్వప్నకుమారి, ఫాతిమ, కవిత, అనురాధ, స్వప్న, ప్రభావతి, రమ, సౌజన్య, విద్యార్థులు పాల్గొన్నారు.
ఆదిబట్ల ప్రభుత్వ పాఠశాలలో..
ఇబ్రహీంపట్నంరూరల్, డిసెంబర్ 22 : గణిత పితామహుడు శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా గణిత దినోత్సవాన్ని ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని ఆదిబట్ల ప్రభుత్వ పాఠశాలలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ప్రధానోపాధ్యాయుడు వర్కాల పరమేశ్ ఆధ్వర్యంలో శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గణిత అధ్యాపకుడు అశోక్‌కుమార్‌ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఉపాద్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
విద్యార్థులకు వ్యాసరచణ పోటీలు
కొందుర్గు, డిసెంబర్ 22 : జిల్లెడు చౌదరిగూడ మండలంలోని వీరన్నపేట ప్రాథమిక పాఠశాలలో గణిత దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు క్వీజ్, వ్యాసరచణ పోటీలు నిర్వహించారు. అనంతరం పాఠశాల ఆవరణలో శ్రీనివాస రామానుజన్ చిత్ర పటానికి నివాళులర్పించారు. అనంతరం పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఈశ్వర్రావు, శమంత, విజయలక్ష్మి పాల్గొన్నారు.