నిత్యం పంచాయతీ ట్రాక్టర్‌తో ఇంటింటికీ వెళ్లి చెత్తసేకరణ
అందుబాటులోకి వైకుంఠధామం, డంపింగ్‌యార్డు
ప్రతి వీధిలో సీసీ రోడ్డు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీలు
విద్యుత్ దీపాలతో జిగేల్మంటున్న గ్రామం
చిట్టడవిని తలపిస్తున్న పల్లె ప్రకృతి వనం
గ్రామ రోడ్డుకు ఇరువైపులా స్వాగతతోరణాల్లా హరితహారం మొక్కలు
చేవెళ్ల రూరల్, డిసెంబర్ 21: సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంతో మండలంలోని తల్లారం గ్రామం అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్తున్నది. ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులను స్థానిక పాలకవర్గ సభ్యులు సద్వినియోగం చేసుకుంటూ గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్నా రు. పల్లెప్రగతి నిధులతో వైకుంఠధామం, డంపింగ్ యార్డు, సీసీ రోడ్లు, వీధిలైట్లను ఏర్పాటు చేశారు. హరితహారంలో రోడ్డుకు ఇరువైపులా నాటిన మొ క్కలు ఏపుగా పెరిగి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. మిషన్ భగీరథ నీటి ట్యాం కు ద్వారా ప్రతిరోజూ స్థానికులకు తాగునీటిని అందిస్తున్నారు. గ్రామంలో గతంలో పేరుకుపోయిన సమస్యలన్నీ పరిష్కారానికి నోచుకున్నాయి.
గ్రామ జనాభా 958 మంది..
తల్లారం ( దుద్దాగు అనుబంధ గ్రామం) గ్రామ జనాభా 958, ఓటర్లు 799 మంది ఉన్నారు. చిన్న గ్రామ పంచాయతీ అయినా అభివృద్ధిలో మండలంలోని ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. సర్పంచ్ గూడెం సురేందర్, పంచాయతీ కార్యదర్శి రోషన్ ప్రత్యేక చొరవ తీసుకొని గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్నారని స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
జరిగిన అభివృద్ధి పనులు..
తల్లారంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వీధి దీపాల ఏర్పాటు, సీసీ కెమెరాలు, ట్రాక్టర్, వైకుంఠధామం, డంపింగ్ యార్డు, నర్సరీ, పల్లె ప్రకృతివనం తదితర అభివృద్ధి పనులను పూర్తి చేశారు. పల్లెప్రకృతివనంలోని మొక్కలతో ప చ్చదనం నెలకొన్నది. గ్రామంలో పారిశుధ్య నిర్వహణకు పాలకవర్గ సభ్యులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. పంచాయతీ సిబ్బంది ప్రతిరోజూ ఇండ్ల ఎదుట ఉన్న చెత్తాచెదారాన్ని సేకరించి పల్లెప్రగతి నిధులతో కొనుగోలు చేసి ట్రాక్టర్ ద్వారా డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. అక్కడ తడి, పొడి చెత్తను వేరు చేసి ఎరువును తయారుచేస్తున్నారు. ఆ ఎరువును హరితహారం, పల్లెప్రకృతివనంలోని మొక్కలకు వినియోగిస్తున్నారు.
స్వాగత తోరణాలుగా హరితహారం మొక్కలు..
ప్రధాన రహదారికి ఇరువైపులా, గ్రామ పరిసరాల్లో హరితహారంలో నాటిన మొక్కలు ఏపుగా పెరిగి స్వాగత తోరణాలుగా దర్శనమిస్తున్నాయి. మొక్కల సంరక్షణకు ప్రత్యేకంగా సిబ్బందిని కేటాయించారు. వారు ప్రతిరోజూ మొక్కలకు నీరు అందిస్తూ కాపాడుతున్నారు.
పల్లెప్రగతితోనే అభివృద్ధి..
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామ రూపురేఖలు మారిపోయాయి. గ్రామంలో వైకుంఠధామం, డంపింగ్ యార్డు, సీసీ రోడ్లు, వీధిలైట్లు వంటి పలు అభివృద్ధి పనులను చేపట్టడం జరిగింది. పారిశుధ్య సిబ్బంది ప్రతిరోజూ గ్రామాన్ని శుభ్రంగా ఉంచుతున్నా రు. పంచాయతీ పాలకవర్గం, గ్రామస్తులు, అధికారులు గ్రామాభివృద్ధికి సహకరిస్తున్నారు.
గ్రామాభివృద్ధికి కృషి
గతంలో పేరుకుపోయిన ఏండ్ల నాటి సమస్యలు కూడా పల్లె ప్రగతితో పరిష్కరించబడ్డాయి. ప్రజలకు మౌలిక వసతులు కల్పిస్తున్నాం. గ్రామాభివృద్ధికి ప్రజలు సహకరిస్తున్నారు. పారిశుధ్య సిబ్బంది ప్రతిరోజూ గ్రామాన్ని శుభ్రంగా ఉంచుతున్నారు. అధికారుల ఆదేశాల మేరకు గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్నా.