పరిగి, డిసెంబర్ 21: పేదలు సంతోషంగా పండుగ నిర్వహించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం క్రిస్మస్ కానుకలు అందజేస్తున్నదని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి తెలిపారు. మంగళవారం పరిగిలోని బృందావన్‌గార్డెన్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ప్రభుత్వం ఉచితంగా అందజేసిన క్రిస్మస్ కానుకలను పేదలకు ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని పండుగలకు ప్రాధాన్యత ఇస్తున్నదన్నారు. క్రిస్మస్, రంజాన్లకు పేదలకు దుస్తులు అందజేయడంతోపాటు విందులు ఏర్పాటు చేస్తుందన్నారు. బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడపడచులకు కానుకగా చీరలు అందజేస్తున్నదని చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలు దేశంలో ఎక్కడా అమలు కావడం లేదని, పేద ప్రజలు సంతోషంగా పండుగ జరుపుకునేందుకు సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. ప్రతి ఇంటికి ఏదో ఒక సంక్షేమ పథకం ద్వారా మేలు చేకూరిందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి పుష్పలత, ఎంపీపీలు కె.అరవిందరావు, సత్యమ్మ, అనసూయ, మల్లేశం, జడ్పీటీసీలు బి.హరిప్రియ, మేఘమాల, రాందాస్, మార్కెట్ చైర్మన్ ఎ.సురేందర్, పీఏసీఎస్ కొప్పుల శ్యాంసుందర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఆర్.ఆంజనేయులు, జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు హఫీజ్, డిప్యూటీ తాసిల్దార్ నర్సింహారెడ్డి, ఆర్ఐలు వెంకట్రాంరెడ్డి, బాల్‌రాజ్, క్రిస్టియన్ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.