
రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్
దొరకుంటలో కల్యాణ మండపం నిర్మాణానికి శంకుస్థాపన
కోదాడ రూరల్, నవంబర్ 21 : కమ్మ కులస్తులు సమాజసేవలో ముందుండాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. ఆదివారం దొరకుంటలో కాకతీయ కమ్మ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కల్యాణ మండపం నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌తో కలిసి ఆయన భూమి పూజ చేసి మాట్లాడారు. కల్యాణ మండపం నిర్మాణానికి రెండెకరాల భూమి అందించిన టీఆర్ఎస్ నాయకుడు ఎర్నేని వెంకటరత్నంబాబును అభినందించారు. ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ మాట్లాడుతూ.. సామాజిక కార్యక్రమాలకు తనవంతు సహకారం ఉంటుందన్నారు. అనంతరం కార్తిక వన భోజనాలు నిర్వహించారు. గంగవరపు రామకృష్ణప్రసాద్, రత్నాకర్, ఎర్నేని కుసుమాకుమారి, ఎర్నేని శ్రీమన్నారాయణ, నిర్మల, హేమాక్రాంతి, వేమూరి సత్యనారాయణ, తుమ్మలపల్లి భాస్కర్, నలజాల శ్రీనివాసరావు, తమ్మర శ్రీధర్, సర్పంచులు పాల్గొన్నారు.
మంత్రికి గిరిజనుల వినతి..
చిలుకూరు : గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సర్వీసు నడపాలని కోరుతూ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు కోదాడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గిరిజన నాయకులు వినతిపత్రం ఇచ్చారు. కోదాడ నుంచి రామలక్ష్మీపురం వరకు ఆర్టీసీ బస్సు సర్వీసును పునరుద్ధరించాలని కోరారు. స్పందించిన మంత్రి బస్సు సౌకర్యం కల్పిస్తానని హామీ ఇచ్చారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో గిరిజన నాయకులు బట్టు వెంకటేశ్వర్లు, బర్మావత్ రవి, అజ్మీర్ప్రసాద్, రాజు పాల్గొన్నారు.