చావు డప్పులో పాల్గొన్న రైతులు
ధాన్యం కొనుగోలు చేసే వరకు కేంద్రాన్ని వెంటాడుతామని స్పష్టం చేసిన నాయకులు
పాల్గొన్న ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, రైతులు
షాబాద్/చేవెళ్లటౌన్/చేవెళ్ల రూరల్/మొయినాబాద్/శంకర్పల్లి, డిసెంబర్ 20 : టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు చేవెళ్ల నియోజకవర్గంలో నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టారు. సోమవారం నియోజకవర్గం పరిధిలోని చేవెళ్ల, షాబాద్, మొయినాబాద్, శంకర్పల్లి మండలాల్లో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, రైతులు ధర్నాలో పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చావుడప్పు తో ఊరూరా ర్యాలీలు నిర్వహించి కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. రైతులకు న్యాయం జరిగేంతా వరకు టీఆర్ఎస్ ఆధ్వర్యంలో పోరాటాలు కొనసాగిస్తామని నాయకులు స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఆయా మండలాల ఎంపీపీలు మల్గారి విజయలక్ష్మి, కోట్ల ప్రశాంతిరెడ్డి, గునుగుర్తి నక్షత్రం, గోవర్ధన్‌రెడ్డి, జడ్పీటీసీలు పట్నం అవినాశ్‌రెడ్డి, కాలె శ్రీకాంత్, మాలతి, గోవిందమ్మ, పార్టీ అధ్యక్షులు ప్రభాకర్, నర్సింగ్‌రావు, మహేందర్‌రెడ్డి, గోపాల్, వాసుదేవ్‌కన్నా, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు స్వప్న, కృష్ణారెడ్డి, నర్సింహులు, నాగార్జునరెడ్డి, ఎస్సీసెల్ అధ్యక్షుడు తొంట వెంకటయ్య, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు శ్రీనివాస్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాజు, మాజీ చైర్మన్ జగన్మోహన్రెడ్డి, సీనియర్ నాయకులు నర్సింహారెడ్డి, కృష్ణారెడ్డి, రాఘవేందర్‌యాదవ్, ఆంజనేయులు ఉన్నారు.
బీజేపీ చెప్పేదొకటి.. చేసేదొకటి