ఇబ్రహీంపట్నంరూరల్, డిసెంబర్ 20 : కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి సారథ్యంలో నియోజకవర్గంలోని ఊరూరా నిరసనలు నిర్వహించారు. ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్‌మెట్ మండలాలతో పాటు ఇబ్రహీంపట్నం, తుర్కయంజాల్, పెద్దఅంబర్‌పేట్, ఆదిబట్ల మున్సిపాలిటీల్లోని అన్ని గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వడ్లను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. వివిధ చోట్ల కేంద్రం దిష్టిబొమ్మలను దహనం చేశారు. యాచారంలో నిర్వహించిన నిరసన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తాలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్తువెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో రాష్ట్ర నాయకులు క్యామ మల్లేశ్, ఎంపీపీ కృపేష్, మున్సిపల్ ఛైర్పర్సన్ స్రవంతి, పార్టీ మండల అధ్యక్షుడు బుగ్గరాములు, సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు రాంరెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు భరత్‌రెడ్డి, సహకార సంఘం చైర్మన్లు పాల్గొన్నారు. మంచాల మండల కేంద్రంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చీరాల రమేశ్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. సహకార సంఘం చైర్మన్ పుల్లారెడ్డి, నాయకులు బహదూర్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. అబ్దుల్లాపూర్‌మెట్ మండల కేంద్రంలో రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ వంగేటి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. తుర్కయంజాల్, పెద్దఅంబర్‌పేట్, ఆదిబట్ల మున్సిపాలిటి కేంద్రాల్లో నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొని ర్యాలీలు నిర్వహించారు. ఇబ్రహీంపట్నం సాగర్హ్రదారిపై ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ చౌరస్తాలో రాస్తారోకో అనంతరం కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దహనం చేశారు.
పల్లె పల్లెనా మోగిన చావుడప్పు
ఆమనగల్లు జోన్ బృందం, డిసెంబర్ 20 : కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల చూపుతున్న వివక్షతకు నిరసనగా సోమవారం ఆమనగల్లు బ్లాక్ మండలాల్లో సీఎం కేసీఆర్ పిలుపు మేరకు పల్లెపల్లెనా చావుడప్పును మోగించారు. ఆమనగల్లు మండల కేంద్రంలో టీఆర్ఎస్ నాయకులు, రైతులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. హైద్రాబాద్-శ్రీశైలం ప్రధాన రహదారి పై కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. తలకొండపల్లి, కడ్తాల్, మాడ్గుల మండల కేంద్రంతో పాటుచగా ఆయా గ్రామాల్లో రైతులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి పీఎం మోడీ దిష్టిబొమ్మ దహనం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు గోలి శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అర్జున్‌రావు, వైస్ ఎంపీపీ అనంతరెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ తోటగిరి యాదవ్, రైతుబంధు సమితి అధ్యక్షుడు నిట్టనారాయణ, నాయకులు ఖలీల్, కౌన్సిలర్ రాధమ్మ, జడ్పీటీసీ అనురాధ, నిరంజన్‌గౌడ్, తలకొండపల్లి పార్టీ మండల అధ్యక్షుడు శంకర్, మాజీ ఎంపీపీ శ్రీనివాస్‌యాదవ్, ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, జడ్పీ కోఆప్షన్ రహమాన్, టీఆర్ఎస్ కడ్తాల్ మండల అధ్యక్షుడు పరమేశ్, జడ్పీటీసీ దశరథ్‌నాయక్, సింగిల్‌విండో చైర్మన్ వెంకటేశ్, మండల రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ జోగు వీరయ్య, సర్పంచ్ ఎల్ఎన్రెడ్డి, ఎంపీటీసీ లచ్చీరాంనాయక్, ఉప సర్పంచ్ రామకృష్ణ, మాడ్గుల మండలంలో వైస్ ఎంపీపీ శంకర్‌నాయక్, సర్పంచ్ అంబాల జంగయ్య, రమేశ్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ రవి, శంకర్ పాల్గొన్నారు.