
బాలుర, బాలికల విభాగంలో విజేత
ద్వితీయ స్థానంలో నిలిచిన రంగారెడ్డి జట్లు
ముగిసిన అండర్-19 రాష్ట్రస్థాయి బాస్కెట్ బాల్ టోర్నీ
అయిజ, నవంబర్ 20 : జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మండలం ఉత్తనూరులో మూడ్రోజులుగా జరిగిన 5వ రాష్ట్ర స్థాయి అండర్-19 జూనియర్ అంతర్‌జిల్లాల బాస్కెట్‌బాల్ చాంపియన్ షిప్ పోటీలు శనివారంతో ముగిశాయి. టోర్నీలో హైదరాబాద్ బాలికలు, బాలుర జట్లు విజేతలుగా నిలిచాయి. గ్రామంలోని ఎన్టీఆర్ మి నీ స్టేడియంలో బాలికల విభాగంలో జరిగిన ఫై నల్ మ్యాచ్‌లో హైదరాబాద్-రంగారెడ్డి జట్లు త లపడ్డాయి. ఈ పోటీలలో హైదరాబాద్ బాలికల జట్టు 41 స్కోరు సాధించి విజేతగా నిలువగా, 21 స్కోరుతో రంగారెడ్డి జిల్లా ద్వితీయ స్థానంతో సరిపెట్టుకున్నది. అలాగే బాలుర విభాగంలో హై దరాబాద్-రంగారెడ్డి జట్ల మధ్య జరిగిన ఫైనల్ పోరులో హైదరాబాద్ జట్టు 36 స్కోరు సాధించి విజేతగా నిలిచింది. రంగారెడ్డి 21 స్కోరుతో ర న్నర్‌గా నిలిచింది. హైదరాబాద్ బాలికల క్రీడాకారిణులు రాగమ్య 13, కుందన 8, రంగారెడ్డి క్రీడాకారిణులు లాస్య 10, రేఖ 5 వ్యక్తిగత స్కోరు సాధించారు. బాలుర విభాగంలో హైదరాబాద్ క్రీడాకారులు సురేశ్ 16, గౌతమ్ 12, రంగారెడ్డి క్రీడాకారులు సోయబ్ 15, చైతన్య 6 వ్యక్తిగత స్కోరు సాధించినట్లు బాస్కెట్ బాల్ కా ర్యదర్శి నీలిమ తెలిపారు. ఈ పోటీలకు 10 జి ల్లాల నుంచి 20 బాల, బాలికల జట్లు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పాల్గొన్నాయి.