ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
టీఆర్ఎస్ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులతో సమావేశం
ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 19 : తెలంగాణ రైతులపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వివక్ష చూపుతున్నదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఇబ్రహీంపట్నం క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్ మండలాలు, మున్సిపాలిటీల అధ్యక్ష, కార్యదర్శులు, ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం మొండివైఖరిని ఎండగడుతూ.. సోమవారం చేపట్టే నిరసన కార్యక్రమాలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం యాసంగికాలం వడ్లను కొనేదిలేదని ప్రకటించిన విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. కేంద్రప్రభుత్వం తన బాధ్యతలను విస్మరిస్తూ రైతులను రోడ్డుపాలు చేసే కుట్రలు చేస్తున్నదన్నారు. బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను టీఆర్ఎస్పార్టీ సహించదని.. తిరుగబడుతుందని హెచ్చరించారు. గ్రామగ్రామాన నిరసన ప్రదర్శనలు చేపట్టి రైతుల సత్తా చాటాలన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ సత్తయ్య, ఎంపీపీ కృపేశ్, మున్సిపల్ చైర్పర్సన్లు చెవుల స్వప్న, కప్పరి స్రవంతి, జడ్పీటీసీ జంగమ్మ, మండల అధ్యక్షులు బుగ్గ రాములు, రమేశ్‌గౌడ్, కొత్త కిషన్‌గౌడ్, చీరాల రమేశ్, మున్సిపల్ అధ్యక్షులు అల్వాల వెంకట్‌రెడ్డి, సిద్ధంకి కృష్ణారెడ్డి, కొప్పు జంగయ్య, సహకార సంఘం చైర్మన్ విఠల్‌రెడ్డి, నాయకులు తాళ్ల మహేశ్‌గౌడ్, ఆకుల యాదగిరి, కందాడి లక్ష్మారెడ్డి, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.