ఎమ్మెల్సీ నారాయణరెడ్డి,ఎమ్మెల్యేలు జైపాల్‌యాదవ్, కిషన్‌రెడ్డి
వివిధ మండలాల్లో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
ఆమనగల్లు, డిసెంబర్ 18 : గ్రామాల అభివృద్ధికి తనవంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని, పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. శనివారం ఆమనగల్లు బ్లాక్ మండలాలకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని కోరారు. అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ మాడ్గుల, తలకొండపల్లి, కడ్తాల, ఆమనగల్లు మండలాల్లో ప్రాధాన్యతా క్రమంలో విడుతలవారీగా అభివృద్ధి పనుల కోసం తన నిధులను కేటాయిస్తానని తెలిపారు. సమస్యలు ఉన్న గ్రామాలు, తండాల్లో మట్టి రోడ్లను బీటీ రోడ్లు, కమ్యూనిటీ హాలు, సీసీ రోడ్లకు నిధులు కేటాయిస్తానని హామీనిచ్చారు. అనంతరం ఆమనగల్లు మండలంలోని చింతలపల్లి గ్రామానికి చెందిన ప్రతాప్‌రెడ్డికి మంజూరైన రూ.1.20 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు.అంతకు ముందు ఆయా మండలాలకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు ఎమ్మెల్సీని శాలువాలు, పూలమాలలతో సత్కరించారు.
నిరుపేదల ఆరోగ్య భద్రతకు భరోసా
కడ్తాల్, డిసెంబర్ 18 : పేద ప్రజల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం భరోసాను కల్పిస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. మండల పరిధిలోని ముద్విన్ గ్రామానికి చెందిన ఎట్టయ్యయాదవ్కి రూ.97, 500 సీఎం సహాయనిధి చెక్కు ను శనివారం ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్ పథకం పేదలందరికీ వరంలా మారిందన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ డైరెక్టర్ వెంకటయ్య, సాంబశివరావు, దామోదర్‌రెడ్డి పాల్గొన్నారు.
పేదలకు కొండంత అండ
ఇబ్రహీంపట్నంరూరల్, డిసెంబర్ 18 : వైద్యసేవలు అవసరం పడిన పేదప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి పథకం కొండంత అండగా నిలుస్తున్నదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నానికి చెందిన దూలం కిరణ్‌కుమార్‌కు రూ.55వేలు సీఎం సహాయనిధి చెక్కును శనివారం ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ కరోనా మహమ్మారి కారణంగా ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైనప్పటికీ పేదలకు అందించే సంక్షేమ పథకాలకు లోటు రాకుండా సీఎం కేసీఆర్ చేపట్టిన చర్యలు అభినందనీయమన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ప్రతాప్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్తువెంకటరమణారెడ్డి, టీఆర్ఎస్ నాయకుడు వెంకటేశ్‌గుప్తా తదితరులు పాల్గొన్నారు.
సీఎం సహాయనిధి పేదలకు వరం
మంచాల, డిసెంబర్ 18 : సీఎం సహాయనిధి నిరుపేదలకు వరంగా మారిందని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చీరాల రమేశ్ అన్నారు. మండల పరిధిలోని ఆరుట్ల గ్రామానికి చెందిన జ్యోతికి సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన 21 వేల రూపాయల చెక్కును శనివారం ఆయన అందజేశారు. సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు పున్నం రాము తదితరులు పాల్గొన్నారు.