షాద్‌నగర్ టౌన్, డిసెంబర్ 17: కొవిడ్ కట్టడికి ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని షాద్‌నగర్ మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్ అన్నారు. శుక్రవారం ఆయన మున్సిపాలిటీలోని పలు వా ర్డుల్లో కొనసాగుతున్న కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను మున్సిపల్ కమిషనర్ జయంత్‌కుమార్‌రెడ్డి, హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీనివాస్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటివరకు వ్యాక్సిన్ తీసుకోని వారందరూ వెం టనే వేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బందితో పాటు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
మాస్కులు ధరించాలి
యాచారం, డిసెంబర్ 17: ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని, ఒమిక్రాన్ వైరస్‌తో అప్రమత్తంగా ఉండాలని మండల వైద్యాధికారి ఉమాదేవి సూచించారు. శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఇంటి నుంచి బయటకెళ్తే ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. ఈనెలాఖరు వరకు మండలంలోని అన్ని గ్రామాల్లో 100 శాతం కొవిడ్ వ్యాక్సినేషన్‌ను పూర్తి చేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో..
శంకర్పల్లి, డిసెంబర్ 17: గ్రామాల్లో కొవిడ్ వ్యాక్సినేషన్ వందశాతం జరిగేలా వైద్య సిబ్బంది కృషి చేయాలని శంకర్పల్లి ఇన్చార్జి ఎంపీడీవో రవీందర్ అన్నారు. శుక్రవారం ఆయన టంగటూరు గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి మాట్లాడారు. మొదటి డోసు 95శాతం వరకు పూర్తి అయ్యిందని, రెండో డోసును కూడా త్వరగా పూర్తి చేయాలని వైద్య సిబ్బందికి సూచించారు. ప్రజలు కొత్త వేరియం ట్ ఒమిక్రాన్‌తో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని సూచించారు. అంతకు ముందు ఎంపీడీవో మండలంలోని మియాఖాన్‌గడ్డ, టంగటూరు గ్రామాల్లోని నర్సరీలను పరిశీలించారు. ఆయా కార్యక్రమాల్లో సర్పంచులు, సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.