చేవెళ్ల రూరల్, డిసెంబర్ 17 : మైనింగ్ తవ్వకాలపై అభిప్రాయాలు తెలుపాలని రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అడిషనల్ కలెక్టర్ తిరుపతిరావు అన్నారు. శుక్రవారం కియాన్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్, ఎంఎస్ ఎస్ఆర్ మినరల్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మైనింగ్ ప్రదేశంలో పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అడిషనల్ కలెక్టర్ (ల్యాండ్స్ అండ్ రెవెన్యూ) తిరుపతిరావు హాజరై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో చేవెళ్ల మండల పరిధిలోని అంతారం, హస్తేపూర్ గ్రామ పరిధిలో తవ్వకాలు చేపడుతున్నట్లు చెప్పారు. మైనింగ్ కియాన్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్, ఎంఎస్ ఎస్ఆర్ మినరల్స్ కంపెనీ మరింత తవ్వకాలు చేపట్టడానికి అనుమతులకోసం ఈ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టామన్నారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటిని పరిశీలిస్తామన్నారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు, చేవెళ్ల తాసిల్దార్ అశోక్, అంతారం సర్పంచ్ సులోచనాఅంజన్గౌడ్, హస్తేపూర్ గ్రామ సర్పంచ్ వెంకటయ్య, పంచాయతీ కార్యదర్శులు హనూష, హరిచంద్రనాయక్, చేవెళ్ల సీఐ విజయ్ భాస్కర్‌రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ శంకర్, పోలీస్ సిబ్బంది, గ్రామాల వార్డు సభ్యులు పాల్గొన్నారు.