షాబాద్, డిసెంబర్ 17: గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పంచాయతీరాజ్ శాఖ రాష్ట్ర పారిశుధ్య తనిఖీ అధికారి సునీత అన్నారు. శుక్రవారం ఆమె మండలంలోని కేసారం, కుర్వగూడ గ్రామాలను సందర్శించారు. గ్రామాల్లోని పల్లెప్రకృతివనాలు, హరితహారం నర్సరీలు, అం గన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, పం చాయతీ కార్యాలయాలను సందర్శించి రికార్డు లు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఇండ్ల నుంచి సేకరించే చెత్త ను తడి, పొడిగా వేరు చేసి డంపింగ్ యార్డుకు తరలించాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పారిశుధ్యం లోపించకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. ఆమె వెంట ఆయా గ్రామాల సర్పంచులు చల్లా సంధ్యాశ్రీరాంరెడ్డి, బుయ్యని సంధ్యారాణి, పం చాయతీ కార్యదర్శి ప్రభాకర్, సిబ్బంది ఉన్నారు.