కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి కొడంగల్, డిసెంబర్ 15: మున్సిపల్ పరిధిలో రూ.15కోట్ల నిధులతో కొన సాగుతున్న అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయించాలని ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి సంబంధిత అధికారులకు ఆదేశించారు. బుధవారం మున్సిపల్ పరిధిలోని 2వ వార్డులో ఎమ్మెల్యే పర్యటించి అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మున్సిపల్ అభి వృద్ధిలో భాగంగా రూ.15కోట్లకు సంబంధించి మంజూరైన మురుగు కాలు వల, సీసీ రోడ్డు నిర్మాణం పనులు వెంటనే పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా వార్డు వాసులతో నేరుగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ముద్దప్ప దేశ్‌ముఖ్, కౌన్సిలర్లు మధుసూదన్‌యాదవ్, వెంక ట్‌రెడ్డి, మాజీ సర్పంచ్ రమేశ్‌బాబు, మాజీ జడ్పీటీసీ ఏన్గుల భాస్కర్, మున్సిపల్ కమిషనర్ నాగరాజు పాల్గొన్నారు. రూ.లక్ష ఎల్వోసీ అందజేసిన ఎమ్మెల్యే బొంరాస్‌పేట, డిసెంబర్ 15: మండలంలోని చౌదర్పల్లి గ్రామానికి చెం దిన మల్కయ్యకు రూ.లక్ష ఎల్వోసి ఉత్తర్వు కాపీని ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి బుధవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో అందజేశారు. మల్కయ్య రోడ్డు ప్రమాదంలో గాయపడి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు దవాఖానాలో చికిత్స పొందుతున్నాడు. ఆర్థిక సాయం కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోగా రూ.లక్షలకు ఎల్వోసి మంజూరు చేసింది. కార్యక్రమం లో వైస్ ఎంపీపీ నారాయణరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు తుల్జారెడ్డి, అంజిలయ్య పాల్గొన్నారు.