యాచారం, నవంబర్13 : జాతీయ స్థాయి క్రీడాపోటీల్లో సత్తా చాటి రాష్ర్టానికి మంచి గుర్తింపు తీసుకురావాలని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని సాయిశరణం ఫంక్షన్హాల్లో జిల్లా ఫ్లోర్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 7వ రాష్ట్ర స్థాయి ఫ్లోర్‌బాల్ టోర్నమెంట్‌ను ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఆయన ఫ్లోర్‌బాల్ బ్యాట్‌తో బాల్‌ను కొట్టి మెదక్, నిజామాబాద్ అండర్-17 బాలుర మ్యాచ్‌ను ప్రారంభించారు. టోర్నమెంట్‌కు 16 జిల్లాలకు చెందిన అండర్-14, 17, 19 బాల, బాలికలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటుగా క్రీడల్లో రాణించాలన్నారు. రాష్ట్ర స్థాయి ప్లోర్‌బాల్ క్రీడా పోటీల్లో సత్తా చాటి జాతీయ స్థాయి జట్టుకు ఎంపిక కావాలన్నారు. గ్రామీణ క్రీడాకారులకు ప్రభుత్వం అన్ని విధాలుగా చేయూతనిస్తున్నదన్నారు. పాఠశాల స్థాయినుంచే క్రీడలపై ఆసక్తి కనబర్చాలన్నారు. ఉత్తమ క్రీడాకారుల స్ఫూర్తితో అన్ని రకాల క్రీడల్లో రాణించి గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదగాలన్నారు.
గ్రామీణ క్రీడాకారులకు ప్రోత్సాహం..
గ్రామీణ క్రీడాకారులకు తనవంతు సహాయ సహకారాలు అందజేస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు. క్రీడా కోటాలో ఉద్యోగం, ఉపాధి అవకాశాలు ఉన్నందున క్రీడల్లో రాణించాలన్నారు. క్రికెట్, కబడ్డీ, వాలీబాల్ క్రీడల మాదిరిగా ఫ్లోర్‌బాల్ క్రీడను నియోజకవర్గంలో విస్తరింపజేసేందుకు కృషి చేయాలన్నారు. క్రీడలు మానసిక, శారీరక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయన్నారు. రాష్ట్ర స్థాయి ఫ్లోర్‌బాల్ క్రీడాపోటీలను నియోజకవర్గంలోనిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ సుకన్య, పీఏసీఎస్ చైర్మన్ రాజేందర్‌రెడ్డి, వైస్ చైర్మన్ యాదయ్య, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటరమణారెడ్డి, సర్పంచ్‌లు శ్రీనివాస్‌రెడ్డి, బండిమీది కృష్ణ, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమేశ్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి బాషా, నాయకులు రమేశ్, జర్కోని రాజు, భాస్కర్, మారోజు శ్రీనివాస్‌చారి, రాజ్‌కుమార్, మోటె శ్రీశైలం, శంకర్‌నాయక్, డేరంగుల శంకర్, టోర్నమెంట్ ఇన్చార్జి ఖాజు, ఫ్లోర్‌బాల్ అసోసియేషన్ జిల్లా నాయకులు బంటి, యూత్ ఫోర్స్ నాయకులు, క్రీడాకారులు పాల్గొన్నారు.