
కేంద్రం తీరుతో రైతుకు నష్టం
మొత్తం ధాన్యాన్ని కొనాల్సిందే
రైతులు ఆరుతడి పంటలు వేయాలి
ఎంపీపీ లక్ష్మి, పీఏసీఎస్ చైర్మన్ నాగిళ్ల
అక్కన్నపేట/ ధూళిమిట్ట, నవంబర్ 13 : అక్కన్నపేట మండలంలోని మంచినీళ్లబండలో కొనుగోలు కేంద్రాన్ని శనివారం ఎంపీపీ లక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ.. రైతులు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించి మద్దతు ధర పొం దాలన్నారు. అకాల వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ కవితాకుమార్, మార్కెట్ చైర్మన్ అశోక్బాబు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సాంబరాజు, మాజీ జడ్పీటీసీ బీలునాయక్, ఎంపీటీసీ గంగాధరి సుగుణ పాల్గొన్నారు.
రైతు సంక్షేమమే టీఆర్ఎస్ ధ్యేయం
ధూళిమిట్ట మండలంలోని భైరాన్పల్లిలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ శ్రీనివాస్, ఎంపీటీసీ నర్సింహులుతో కలిసి పీఏసీఎస్ చైర్మన్ నాగిళ్ల తిరుపతిరెడ్డి ప్రారం భించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు సంక్షేమమే టీఆర్ఎస్ ధ్యేయమని, సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ వైస్ చైర్మన్ రాజిరెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్ దేవదాసు, స్థానిక నేత బర్మ రాజమల్లయ్య, ఏఈవో అమల ఉన్నారు.
కేంద్రమే ధాన్యాన్ని కొనుగోలు చేయాలి
మిరుదొడ్డి/ మద్దూరు, నవంబర్ 13 : రైతులను ఇబ్బందులకు గురి చేసిన ఏ ప్రభుత్వం కూడా మనుగడ సాధించిన చరిత్ర లేదని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని పీఏసీఎస్ డైరెక్టర్ నర్సింహారెడ్డి, రైతు నాయకుడు గొట్టం రాధాకృష్ణ హెచ్చ రించారు. మిరుదొడ్డి మండలకేంద్రంలో రైతులతో కలిసి మాట్లాడుతూ.. రైతుల పొట్టకొట్టే విధానాలను కేంద్ర ప్రభుత్వం వీడాలని సూచాంచారు. ధాన్యాన్ని కొనుగోలు చేయకుంటే కేంద్రానికి రైతులు తగిన బుద్ధ్దిచెప్పడం ఖాయమన్నారు. సమావేశంలో రైతులు భగవాన్, బ్రహ్మారెడ్డి, రాజిరెడ్డి, మురళీరావు పాల్గొన్నారు.
రైతులను దగా చేసేందుకే కేంద్రం రైతు వ్యతిరేక చట్టాలు తెస్తున్నదని సీపీఎం మండల కార్యదర్శి ఆలేటి యాదగిరి అన్నారు. మద్దూరు మండలం సలాఖపూర్ లో సీపీఎం గ్రామ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. రైతు వ్యతిరేక చట్టాలతో మొండివైఖరి ఆవలంభిస్తున్న బీజేపీకి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. సమావే శంలో నాయకులు దయ్యాల కనకయ్య, గూడ రాజిరెడ్డి, మహిపాల్, శంకర్, ఐలయ్య, మల్లేశం, బీరయ్య, రాజు, ప్రశాంత్, కిషన్, శ్రీకాంత్, నర్సింహులు పాల్గొన్నారు.