పరిగి, డిసెంబర్ 10: అర్హులందరూ కొవిడ్ వ్యాక్సిన్ వే యించు కోవాలని పరిగి ఎంపీపీ కె.అరవిందరావు సూచించారు. శుక్రవారం పరిగి మండలం చిట్యాల్, రాపోల్ గ్రామాల్లో వ్యాక్సినేషన్ కేం ద్రాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించు కోవా లన్నారు. మొదటి డోసు వేసుకున్న వారు డ్యూ డేట్ రాగానే రెండో డోసు వేయించుకోవాల్సిందిగా సూచించారు. వ్యాక్సిన్ వేయించుకోవడంతో రక్షణ పొందవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో శేషగిరిశర్మ, సర్పంచ్‌లు రజిత, జంగయ్య, గ్రామ పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
టీకా తీసుకోవడమే మార్గం
బొంరాస్‌పేట, డిసెంబరు 10 : మండలంలో వ్యాక్సినేషన్ ప్రక్రి య వందశాతం పూర్తి కావాలని వ్యాక్సినేషన్ మండల ఇన్చార్జి, కొడంగల్ ఏడీఏ వినయ్‌కుమార్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో కొవిడ్ వ్యాక్సినేషన్ పై వైద్య సిబ్బందితో సమీక్షించారు. అనంతరం ఆరోగ్య ఉప కే్ంర దంలో టీకా పంపిణీని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొవిడ్ కట్టడికి టీకా తీసుకోవడం ఒక్కటే మార్గమని, ప్రభుత్వం అంజేస్తున్న ఉచిత టీకా పంపిణీని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మండలంలో మొదటి డోసు తీసుకో వాల్సి న వారు 4300 మంది, రెండోడోసు తీసుకోవాల్సి వారు 10,300 మంది ఉన్నారని వైద్య సిబ్బంది వివరించారు. సమా వేశంలో ఎంపీడీవో మోహన్‌రాజ్, హెల్త్ ఎడ్యుకేటర్ భాస్కరాచారి, సూపర్వైజర్ మణిమాల పాల్గొన్నారు.
వంద శాతం వ్యాక్సినేషన్ లక్ష్యం
యాలాల డిసెంబర్ 10: వంద శాతం వ్యా క్సినేషన్ లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని మండల వైద్య అధికారి అశ్విని అ న్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ఆమె మాట్లాడుతూ మం డలంలో మొదటి డోసు 27790 మందికి రెండో డోసు 3026 మం దికి ఇచ్చినట్టు తెలిపారు. మొదటి డోసు తీసు కొని రెండో డోసు తీసుకోని వారికోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు.
దోమ మండలపరిధిలో..
దోమ, డిసెంబర్10: 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ విధిగా వ్యాక్సిన్ వేసుకోవాలని వీఆర్వో జహంగీర్ పేర్కొన్నారు. దోమ మండల పరిధిలోని దాదాపూర్ గ్రామంలో శుక్రవారం గ్రామపంచాయతీ కార్యాలయంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టారు.