చేవెళ్ల రూరల్, డిసెంబర్ 10: యాసంగిలో వరికి బదులుగా ఆరుతడి పంటలను సాగు చేయాలని ఏడీఏ రమాదేవి అన్నారు. శుక్రవారం ఆమె మండలంలోని కమ్మెట గ్రామంలో వరికి బదులుగా కూరగాయలు, పప్పుదినుసు లు తదితర ఆరుతడి పంటలను సాగుచేసి లాభాలు పొం దాలని సూచించారు. అనంతరం పంటల సాగుకు సంబం ధించిన క్యాలెండర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి కృష్ణమోహన్, వ్యవసాయ విస్తరణాధికారి రమేశ్, రైతులు తదితరులు పాల్గొన్నారు.
గోడపత్రిక ఆవిష్కరణ
మొయినాబాద్, డిసెంబర్ 10: మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేయాలని మండల వ్యవసాయ అధికారి రాగమ్మ అన్నారు. యాసంగిలో వరికి బదులుగా ఆరుతడి పంటలను సాగు చేయాలని వ్యవసాయ అధికారులు గ్రామాల్లో పర్యటించి రైతులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. శుక్రవారం వెంకటాపూర్లో సర్పంచ్ మనోజ్కుమార్తో కలిసి ఆమె ఆరుతడి పంటల సాగుకు సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించి, అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు కూరగాయలు, పప్పుదినుసులు తదితర ఆరుతడి పంటలను సాగు చేసి అధిక దిగుబడి సాధించాలన్నారు. కార్యక్రమంలో ఏఈవోలు కుమార్, రైతులు పాల్గొన్నారు.
వరి సాగు చేయొద్దు
యాచారం, డిసెంబర్ 10: రైతులు వరి పంటను సాగు చేసి ఇబ్బందులు పడొద్దని జడ్పీటీసీ చిన్నోళ్ల జంగమ్మ అన్నారు. శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నా రు. మండలంలో రైతుల సౌకర్యార్థం ప్రభుత్వం యాచా రం, చింతపట్ల గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధరను కల్పిస్తుందన్నారు. యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవని, అందువల్ల రైతులు ఆరుతడి పంటలైన చిరుధాన్యాలు, నూనెగింజలు, కూరగాయలు, పండ్ల తోటలను సాగు చేయాలని ఆమె సూచించారు.
ఇతర పంటలపై దృష్టి సారించాలి
కడ్తాల్, డిసెంబర్ 10: యాసంగిలో రైతులు వరికి బదులుగా ఇతర పంటలను సాగు చేయాలని వ్యవసాయశాఖ ఏవో శ్రీలత అన్నారు. శుక్రవారం టాక్రాజ్గూడ, కర్కల్పహాడ్ గ్రామాల్లో రైతులకు ఇతర పంటల సాగుపై అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏవో శ్రీలత మాట్లాడుతూ యాసంగిలో రైతులు మినుములు, పెసర, ఆముదం, కుసుములు, రాగులు, నువ్వులు, కూరగాయాల పంటలను వేయాలని సూచించా రు. అనంతరం గోడపత్రికను రైతులతో కలిసి ఆమె ఆవిష్కరించారు. కార్యక్రమంలో సర్పంచ్ నాగమణి, హరిచంద్నాయక్, ఏఈవోలు రమణ, సరిత, తేజస్విని, స్వాతి, రైతులు పాల్గొన్నారు.
లాభదాయక పంటలను సాగు చేయాలి
ఆమనగల్లు, డిసెంబర్ 10: రైతులు ఆరుతడి పంటలను సాగు చేయాలని సర్పంచ్ శ్రీనివాస్ కోరారు. శుక్రవారం చెన్నంపల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో రైతులకు ఆరు తడి పంటల సాగుపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ రైతులు వరిని సాగు చేయొద్దన్నారు. కార్యక్రమంలో ఏఈవో శివతేజ, మాజీ ఎంపీటీసీ, స్థానికులు పాల్గొన్నారు.