ప్రతి వీధిలో సీసీ రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణం
అందుబాటులోకి వైకుంఠధామం, డంపింగ్ యార్డు
గ్రామ రోడ్డుకు ఇరువైపులా హరితహారం మొక్కలు
నిత్యం ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరణ
మిషన్ భగీరథతో సరిపడా తాగునీటి సరఫరా
‘పల్లె ప్రగతి’తో మారిన గ్రామ రూపురేఖలు
దోమ, జనవరి9: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పల్లె ప్రగతితో బుద్లాపూర్ గ్రామం అభివృద్ధి సాధించింది. పచ్చ దనం పరిశుభ్రతతో గ్రామం కొత్త రూపును సంతరించు కున్నది. రెండున్నరేండ్లలో పంచాయతీలో కంపోస్టు షెడ్డు నిర్మాణం, సీసీ రోడ్లు, పల్లె ప్రకృతివనం, వైకుంఠధామం పనులు పూర్తి కాగా, వార్డుల్లో కొత్త డ్రైనేజీల నిర్మాణానికి ప్రతి పాదనలు తయారు చేశారు. ఇంటింటికీ మిషన్ భగీరథ నీరు అందించి గ్రామంలో తాగు నీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. గ్రామ సర్పంచ్ జర్పుల మారోనిబాయితో పాటు పాలక వర్గ సభ్యులు ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతో గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడపడానికి నిర్విరామంగా కృషి చేస్తున్నారు. రెండున్నరేండ్లలో రూ.34 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టారు. ప్రతి రోజు పంచాయతీ ట్రాక్టర్‌తో తడి పొడి చెత్త సేకరించి డంపింగ్‌యార్డుకు తరలిస్తూ గ్రామాన్ని శుభ్రంగా ఉంచుతున్నారు. నాటిన మొక్కలను సంరక్షించడం, ప్రతి వార్డులో స్తంభాలకు ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేయడంతో గ్రామ రూపురేఖలే మారిపోయాయి రూ.2.5 లక్షలతో కంపోస్టుషెడ్డు, రూ.8.40 లక్షలతో ట్రాక్టర్ కొనుగోలు, రూ.12.60 లక్షలతో వైకుఠధామం రూ.5 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం తదితర అభివృద్ధి పనులు చేపట్టారు.
గ్రామాభివృద్ధే లక్ష్యం
గ్రామాభివృద్ధే లక్ష్యంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వ సహకారా న్ని అందిపుచ్చుకొని ప్రతి పైసాను సద్వి నియోగం చేసుకుంటున్నాం. అధికా రుల గ్రామస్తుల సలహాలు తీసుకుంటున్నాం.-జర్పుల మారోనిబాయి, సర్పంచ్
గ్రామస్తుల భాగస్వామ్యంతో..
గ్రామంలో అన్ని ప్రాథమిక సౌకర్యాలను కల్పించడంతో పాటు ప్రభుత్వం నిర్దేశిం చిన అభివృద్ధి పనులను పూర్తి చేసే విధం గా చర్యలు చేపడుతున్నాం. గ్రామ ప్రజల భాగస్వామ్యాన్ని తీసుకొని అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాం.-శివ, పంచాయతీ కార్యదర్శి