వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
మర్పల్లి, జనవరి 9: రాష్ట్ర ప్రభుత్వ పథకాలు దేశానికే ఆదర్శమని, రైతుబంధు ఇస్తున ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. ఆదివారం మండలంలోని పట్లూర్‌లో సర్పంచ్ ఇందిరా అశోక్, రైతుబంధు మండల అధ్యక్షుడు నాయబ్‌గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతుబంధు వారోత్సవాల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. జడ్పీ పాఠశాల నుంచి ఎడ్ల బండ్లపై రైతు వేదిక వరకు ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులు పడటంతో వారం రోజుల ముందే గ్రామగ్రామాన సం క్రాంతి పండుగ వాతావరణం నెలకొందన్నారు. పం టలకు పెటుబడి సాయంగా 63 లక్షల కుటుంబాలకు రైతుబంధు పథకం ద్వారా ఇప్పటి వరకు దఫాల వారీగా యాభై వేల కోట్లు అందించిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. రైతు బీమా, ఉచితకరెంటు, సాగునీరు, రైతుబంధు వంటి పథకాల అమలు కోసం అధిక మోతాదులో వ్యవసాయ రంగానికి ఖర్చు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని గుర్తుచేశారు. కార్యక్ర మంలో సర్పంచుల సంఘం మం డ లాధ్యక్షుడు శ్రీనివాస్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు అశోక్, గ్రామాధ్యక్షుడు అశోక్, షాఫీ, నాయకులు ప్రభాకర్‌గుప్తా, రామేశ్వర్, రవి, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
రైతాంగానికి మార్గదర్శకం
వికారాబాద్, జనవరి 9 : రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ, సీఎం కేసీఆర్ మార్గదర్శకంగా నిలిచారని సబితా ఆనంద్ ఫౌండేషన్ చైర్మన్, వికారా బాద్ ఎమ్మెల్యే సతీమణి డాక్టర్ సబితా ఆనంద్ తెలిపారు. ఆదివారం మున్సిపల్ పరిధిలోని 8వ వార్డు టేకులబీడు తండాలో రైతు బంధు వారోత్సవాల్లో భాగంగా సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం ఉచిత వైద్య శిబిరం నిర్వహిం చారు. కార్యక్రమంలో పీఏసీఎస్ వైస్‌చైర్మన్ పాండు, కౌన్సిలర్ సంతోష పాల్గొన్నారు.
నిజమైన రైతుల పండుగ
కులకచర్ల, జనవరి 9: రాష్ట్రంలో నేడు రైతులు నిజమైన పండుగ జరుపుకుం టు న్నా రని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్‌రెడ్డి అన్నారు. ఆదివారం చౌడాపూర్ మండల పరిధిలోని వీరాపూర్ గ్రామంలో వరినాట్లు వేసి రైతుబంధు సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ రైతులకు పెట్టుబడి సహాయం కింద ఎకరాకు రెండు పం టలకు గాను 10వేల రూపా యలు అందిస్తూ ప్రభుత్వమే పెద్దదిక్కుగా నిలుస్తోందని అన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ చౌడాపూర్ మండల అధ్యక్షుడు సత్తినేని సుధాకర్‌రెడ్డి, కులకచర్ల మండల అధ్యక్షుడు శేరి రాంరెడ్డి, పీఏసీఎస్ వైస్ చర్మన్ నాగరాజు, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు పీరంపల్లి రాజు, చౌడాపూర్ ఎంపీటీసీ శంకర్, కులకచర్ల మండల ఎంపీటీసీ ల ఫోరం అధ్యక్షుడు రాంలాల్, వీరాపూర్ గ్రామ సర్పంచ్ జనార్ధన్‌రెడ్డి, ఉపసర్పచ్ నర్సింహులు, టీఆర్ఎస్ చౌడాపూర్ అధ్యక్షుడు రాజయ్య, మాజీ సర్పం చ్ నర్సింహు లు, టీఆర్ఎస్ చౌడాపూర్ మండల ప్రధాన కార్యదర్శి నర్సింహా, చౌడా పూర్ వార్డు సభ్యుడు అశోక్, పార్టీ నాయకులు రాజశేఖర్, చెన్నయ్య, యాద య్య, గౌస్, చంద్రకాం త్‌రెడ్డి, రాజు, నరేశ్ పాల్గొన్నారు. అలాగే కుల కచర్ల మండల పరిధి లోని పీరంపల్లి గ్రామంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.