అంతారంలో జరిగిన రైతుబంధు సంబురాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి
సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం
రాంపూర్‌తండాలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆనంద్
పలుచోట్ల రైతుబంధుపై ముగ్గుల పోటీలు
కులకచర్ల, జనవరి 8 : రైతుబంధు పథకంతో రైతులకు మేలు చేకూరుతున్నదని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అన్నారు. శనివారం కులకచర్ల మండల పరిధిలోని అంతారం గ్రామంలో రైతుబంధు సంబురాల్లో భాగంగా పొలంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు రైతు బంధుతో పాటు రైతుబీమా సౌకర్యాన్ని కల్పించిందన్నారు. రైతులు మృతి చెందితే రూ.5లక్షల ప్రీమియం అందుతుందని వివరించారు. ప్రభుత్వం అన్ని విధాలుగా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తుందని అన్నారు. ఈ సందర్భంగా సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సత్యహరిశ్చంద్ర, జడ్పీటీసీ రాందాస్‌నాయక్, వైస్ ఎంపీపీ రాజశేఖర్‌గౌడ్, ఎంపీటీసీ లలితాబుగ్గయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ హరికృష్ణ, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు రాంలాల్, మాజీ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు రాజప్ప, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి లక్ష్మయ్య, మండల కోఆప్షన్ సభ్యుడు జుబేర్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు బోయిని మొగులయ్య, వెంకటయ్యగౌడ్, కొండయ్య, ఆంజనేయులు, కంగారి ఆంజనేయులు, బోయిని సాయన్న, బుగ్గయ్య, బుచ్చయ్య, శివానంద్, దామోదర్‌రెడ్డి, సర్పంచులు తుల్జానాయక్, లక్ష్మయ్య, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
చౌడాపూర్ మండలంలో..
చౌడాపూర్ మండల పరిధిలోని చాకల్‌పల్లి గ్రామంలో రైతు బంధు సంబురాలు ఘనంగా నిర్వహించారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సత్తినేని సుధాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన రైతుబంధు సంబురాల్లో ఆయా గ్రామాలకు చెందిన రైతులు, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్తోనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం
ధారూరు, జనవరి 8 : రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశారని ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు. శనివారం ధారూరు మండల పరిధిలోని రాంపూర్‌తండా గ్రామంలో రైతుబంధు వారోత్సవాల్లో భాగంగా రాంపూర్‌తండాలో రైతులు, మహిళలు ప్రజాప్రతినిధులు, అధికారులు ఆటా పాటలతో ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించి, గెలుపొందిన వారికి ఎమ్మెల్యే బహుమతులను అందజేసి రైతులను సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం రైతుబంధు అమలు చేస్తూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసిన నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. గ్రామంలో ఉన్న భూ సమస్యలపై రెవెన్యూ అధికారులు జాయింట్ సర్వే చేస్తే సరిపోతుందని అన్నారు.
కార్యకర్త కుటుంబాలకు అండగా గులాబీ జెండా
ధారూరు మండల పరిధిలోని రాంపూర్‌తండా గ్రామంలో ప్రమాదవశాత్తు మరణించిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కుటుంబానికి రూ.2లక్షల ప్రమాదబీమా చెక్కును ఎమ్మెల్యే ఆనంద్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పార్టీ కార్యకర్తల కుటుంబాలకు భరోసాగా ప్రమాద బీమా ఏర్పాటు చేశారన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయశాఖ అధికారి గోపాల్, ధారూరు ఎంపీపీ జైదుపల్లి విజయలక్ష్మి, జడ్పీటీసీ కోస్నం సుజాత, వైస్ ఎంపీపీ విజయ్‌కుమార్, రైతుబంధు కమిటీ మండల అధ్యక్షుడు ఎస్.వెంకటయ్య, వ్యవసాయ మార్కెట్ కమిటీ మండల చైర్మన్ సంతోష్‌కుమార్, వైస్ చైర్మన్ అంజయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజునాయక్, కార్యదర్శులు రాజుగుప్తా, కావలి అంజయ్య, మాజీ అధ్యక్షుడు వేణుగోపాల్‌రెడ్డి, మాజీ పీఏసీఎస్ చైర్మన్ హన్యంత్రెడ్డి, రైతు సంఘం అధ్యక్షుడు లక్ష్మయ్య, టీఆర్ఎస్ యువజన విభాగం మండల అధ్యక్షుడు జైపాల్‌రెడ్డి, మండల వ్యవసాయశాఖ అధికారి జ్యోతి, కుక్కింద ఎంపీటీసీ బసప్ప, సర్పంచులు రాంపూర్‌తండా పాండునాయక్, ధారూరు చంద్రమౌళి, కుక్కింద వీరేశం, వ్యవసాయ విస్తరణ అధికారి సంజీవ్‌రాథోడ్, పంచాయతీ కార్యదర్శి శోభన, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు దేవేందర్, నాయకులు గోవింద్రాజ్గౌడ్, రవీందర్‌నాయక్, బీంసెన్ చారి, విజయ్‌కుమార్, రామచంద్రయ్య, రైతులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మెట్లకుంటలో..
బొంరాస్‌పేట, జనవరి 8 : మండలంలోని మెట్లకుంట గ్రామంలో రైతుబంధు వారోత్సవాలు నిర్వహించారు. రైతు వేదికలో మహిళా రైతులు రైతుబంధు ముగ్గులు వేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ కావలి నారాయణ మాట్లాడుతూ రైతులకు పెట్టుబడిసాయం అందిస్తూ ఆర్థిక భరోసాను కల్పిస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ నర్సింహులు, ఏఈవో భార్గవి, రైతులు పాల్గొన్నారు. దుద్యాలలో రైతులు గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఏఈవో మొహియొద్దీన్, టీఆర్ఎస్ తాలూకా యూత్ అధ్యక్షుడు నరేశ్‌గౌడ్, రైతులు పాల్గొన్నారు.
మర్పల్లి మండలంలో పల్లె పల్లెన..
మర్పల్లి, జనవరి 8 : మండలంలోని వివిధ గ్రామాల్లో ప్రజాప్రతినిధులు రైతుబంధు వారోత్సవాలను నిర్వహించారు. షాపూర్‌తండా, దార్గులపల్లి, బిల్కల్, పంచలింగాల్, కోట్‌మర్పల్లి తదితర గ్రామాల్లో విద్యార్థులు, మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు శ్రీనివాస్, ఆయా గ్రామాల సర్పంచులు సాలీబాయి, విజయ్‌కుమార్, పీర్యానాయక్, పీఏసీఎస్ మాజీ వైస్ చైర్మన్ మల్లయ్య, నాయకులు, రైతులు పాల్గొన్నారు.