ఎమ్మెల్యే కాలె యాదయ్య
గ్రామాల్లో రైతు బంధు సంబురాలు
పాల్గొన్న ప్రజాప్రతినిధులు, నాయకులు
సీఎం కేసీఆర్ రైతు బాంధవుడు
శంకర్పల్లి, జనవరి 8 : సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని అన్ని వర్గాల రైతులను ఆదుకుంటున్నారని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శంకర్పల్లి మండలంలోని ప్రొద్దటూరు గ్రామ పంచాయతీ వద్ద రైతు బంధు సంబురాల్లో పాల్గొన్నారు. 8 విడుతలుగా శంకర్పల్లి మండలంలో 20,220 మంది రైతులకు రూ.143కోట్ల 6లక్షల 55,206లను అందించడం జరిగిందన్నారు. కార్యక్రమం లో జడ్పీటీసీ గోవిందమ్మ, సర్పంచ్ నర్సింహారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గోపాల్, మాజీ ఎంపీటీసీ వెంకట్‌రెడ్డి, ఏవవో సురేశ్‌బాబు, ఏఈవో అనిత పాల్గొన్నారు. శంకర్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో రైతుబంధు సంబురాలు నిర్వహించారు. కార్యక్రమంలో సంఘం చైర్మన్ బుచ్చిరెడ్డి, వైస్ చైర్మన్ బీ.శ్రీధర్, కార్యదర్శి పద్మజ, సూపర్ వైజర్ రాఘవేందర్ పాల్గొన్నారు.
నందిగామ, : రైతుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్ అన్నారు. నందిగామ మండల పరిధిలోని రంగాపూర్ గ్రామంలో సర్పంచ్ రమేశ్‌గౌడ్ ఆధ్వర్యంలో శనివారం రైతుబంధు సంబురాలు నిర్వహించారు. జడ్పీ వైస్ చైర్మన్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల ఆత్మహత్యలు పూర్తిగా తగ్గిపోయాయని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు, రైతు బీమా, వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు వంటి పథకాలతో రైతులకు ఎంతో మేలు జరుగుతున్నదన్నారు. కార్యక్రమంలో నందిగామ పీఏసీఎస్ చైర్మన్ రాజ్‌గోపాల్, నాయకులు తోట భాస్కర్, ఆంజనేయులు, గణేశ్ తదితరులు పాల్గొన్నారు.
ట్రాక్టర్లతో ర్యాలీ
మొయినాబాద్ : మండల పరిధిలోని కేతిరెడ్డిపల్లి క్లస్టర్ పరిధిలోని రైతు వేదిక వద్ద మండల వ్యవసాయ అధికారి ఎన్ రాగమ్మ ఆధ్వర్యంలో సంబురాలు నిర్వహించారు. రైతు సమన్వయ సమితి గ్రామ కో ఆర్డినేటర్లు, సభ్యులు, రైతులు పెద్ద ఎత్తున సంబురాల్లో పాల్గొని ట్రాక్టర్‌తో ర్యాలీ నిర్వహించారు. సీఎం కేసీఆర్ చిత్ర పటానికి రైతులు , టీఆర్ఎస్ నాయకులు క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో నాయకులు దారెడ్డి వెంకట్‌రెడ్డి, ఉపసర్పంచ్ సిద్దయ్య, ఏఈవోలు కుమార్, సునీల్, రైతులు పాల్గొన్నారు.
మున్సిపల్ కార్యాలయంలో ..
ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం మున్సిపల్ కార్యాలయంలో శనివారం రైతుబంధు వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారులు రకరకాల రంగులతో ముగ్గులు వేసి అందంగా అలంకరించారు. రైతుబంధుతో పాటు రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం ప్రవేశపెడుతున్న పథకాలు, వ్యవసాయానికి సంబంధించిన ముగ్గులను కళ్లకు కట్టినట్లుగా చూపించారు. మహిళలకు బహుమతులు అందజేశారు. అనంతరం చైర్పర్సన్ కప్పరి స్రవంతి, వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తున్నదన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు నల్లబోలు మమత, కసరమోని పద్మ, నీలం శ్వేత, బర్ల మంగ, యాచారం సుజాత, అల్వాల జ్యోతి, కొండ్రు శ్రీలత, మున్సిపల్ కమిషనర్ యూసఫ్, నాయకులు బీంరావు సిబ్బంది పాల్గొన్నారు.
దండుమైలారంలో రైతుబంధు వారోత్సవాలు
ఇబ్రహీంపట్నంరూరల్ : మండల పరిధిలోని దండుమైలారం సహకార సంఘంలో రైతుబంధు వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. మహిళలు ముగ్గులు వేశారు. ఎంపీపీ కృపేష్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు మొద్దు అంజిరెడ్డిలు పాల్గొన్నారు. బహుమతులు అందజేశారు. అనంతరం వరిధాన్యంతో రైతుబంధు సంబురాలు అని రాశారు. కార్యక్రమంలో సహకార సంఘం చైర్మన్ వెంకట్‌రెడ్డి, వైస్ చైర్మన్ కాంటేకార్ ఈశ్వర్, సర్పంచ్ రవణమోని మల్లీశ్వరి, ఏవో వరప్రసాద్‌రెడ్డి, ఏఈవో శ్రవణ్‌కుమార్, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు ఐలేష్ పాల్గొన్నారు.