అమ్మాపురంలో ప్రారంభించనున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా.. కేంద్రాలను సిద్ధం చేసిన అధికారులు
మహబూబాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): ధాన్యం కొనుగోలుకు రంగం సిద్ధమైంది. జిల్లాలో వరి కోతలు ప్రారంభమవడంతో అధికారులు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ నెల 6న కలెక్టరేట్లో ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్ శశాంక సమీక్షించారు. ఈ నేపథ్యంలో అధికారులు కేంద్రాల ఏర్పాటుపై అదే రోజు నుంచి దృష్టి సారించారు. జిల్లా వ్యాప్తంగా 230 కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన అధికారులు ఏయే శాఖల ఆధ్వర్యంలో ఎన్ని ఏర్పాటు చేయాలో ఆ శాఖలకు సూచించారు. పీఏసీఎస్ ఆధ్వర్యంలో 145, ఐకేపీ-67, జీసీసీ-10, మెప్మా- 1, మార్కెటింగ్- 6, ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్ అండర్ కంట్రోల్ ఆర్టికల్చర్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఒక కేంద్రం చొప్పున మొత్తం 230 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ ఏడాది వానకాలంలో 1,18,789 మంది రైతులు 2,14,620 ఎకరాల్లో వరి సాగు చేశారు. సుమరు 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఈ క్రమంలో గ్రామాల వారీగా కేంద్రాలు ఏర్పాటు చేసి సోమవారం నుంచి కొనుగోలు ప్రక్రియను ప్రారంభించనున్నారు.
ధాన్యం కొనుగోలుకు రంగం సిద్ధమైంది. జిల్లా లో వరికోతలు ప్రారంభమైన నేపథ్యంలో కేంద్రాలు ఏర్పాటు చేసిన అధికారులు సోమవారం నుంచి కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 6న కలెక్టరేట్లో ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్ శశాంక సమీక్ష నిర్వహించారు. ముందుగా వచ్చిన వడ్లను కేంద్రాల్లో కొనుగోలు చేయాలని కలెక్టర్ వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 230 కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ నెల 8న తొర్రూరు మండలం అమ్మాపురంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రారంభించనున్నారు. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ధాన్యం దిగుబడిని బట్టి మరిన్ని కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. పీఏసీఎస్ ఆధ్వర్యంలో 145, ఐకేపీ-67, జీసీసీ-10, మెప్మా-1, మార్కెటింగ్- 6, ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్ అండర్ కంట్రోల్ ఆర్టికల్చర్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఒక కేంద్రంతో కలుపుకుని మొత్తం 230 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలో ఈ ఏడాది వానకాలంలో 1,18,789 మంది రైతులు 2,14,620 ఎకరాల్లో వరి సాగు చేశారు. జిల్లా వ్యాప్తంగా సుమరుగా 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. 16 మండలాల పరిధిలో రైతుల నుంచి ధాన్యం సేకరించేందుకు ఫౌరసరఫరాల సంస్థ, సహకారశాఖ, మార్కెట్, గిరిజన, డీఆర్డీవో, ఫౌరసరఫరాలశాఖతో మెఫ్మా అధికారులు కేంద్రాలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.
కొనుగోలు కేంద్రాలు ఇవే…పీఏసీఎస్ ఆధ్వర్యంలో..
బయ్యారం మండలంలో బయ్యారం-1, బయ్యా రం-2, బయ్యారం-3, ఇర్సులాపురం, వినోభా నగ ర్, వెంకట్రాంపురం, ఉప్పలపాడు, గంధంపల్లి, చర్లపల్లి, జగ్గుతండా, రాంచంద్రపురం, బాలజీపేట, కేసముద్రం మండలంలో ధన్నసరి, పెనుగొండ, కాట్రపల్లి, ఇంటికన్నె, బెరువాడ, ఉప్పరపల్లి, ఇనుగుర్తి-1, ఇనుగుర్తి-2, కొరుకొండపల్లి X-రోడ్, మహమూద్‌పట్నం, కొమటిపల్లి, కల్వల, తాళ్లపూసపల్లి, డోర్నకల్ మండలంలో చిలుకోడు, గొల్లచర్ల, మన్నెగూడెం, ముల్కలపల్లి, పెరుమాండ్ల సంకీస, కురవి మండలం లో కురవి, మొగిలిచర్ల, నేరడ, రాజోలు, గుండ్రాతిమడుగు, కందికొండ, ఉప్పరిగూడెం, కాంపల్లి, సూదనపల్లి, కొత్తూరు-సీ, గార్ల మండలంలో గార్ల-1, గార్ల-2,సత్యనారాయణపురం, ముల్కనూరు-1, ముల్కనూరు-2, సీతంపేట, పుల్లూరు, పోచారం, రాంపు రం, శేరిపురం, గూడూరు మండలంలో గూడూరు, అయోధ్యపురం, అప్పరాజుపల్లి, భూపతిపేట, కొల్లాపురం, మట్వాడ, తీగలవేణి, గుండెంగ, గోవిందాపు రం, మహబూబాబాద్ మండలంలో అమనగల్-2, అనంతారం, ఈదులపూసపల్లి, జంగిలిగొండ, కంబాలపల్లి, శనిగపురం, సికింద్రాబాద్ తం డా, అయోధ్య, మోట్లతండా, జమాండ్లపల్లి, నడివాడ, లక్ష్మీపురం, సింగారం, మరిపెడ మండలంలో యడ్జెర్ల, మరిపెడ, బురహాన్‌పురం, తానంచర్ల, చిల్లంచర్ల, ఆనేపురం, అబ్బాయిపాలెం, బీచురాజుపల్లి, చిన్నగూడూరు, విస్సంపల్లి, నర్సింహులపేట మండలంలో కొమ్ములవంచ, నర్సింహులపేట-1, నర్సింహులపేట-2, పెద్దనాగారం, దంతాలపల్లి, గున్నెపల్లి, కుమ్మరికుంట్ల, వేములపల్లి, రేపోని, దాట్ల, పెద్దముప్పారం-1, పెద్దముప్పారం-2, బొడ్లాడ, నెల్లికుదురు మండలంలో నెల్లికుదురు-1, నెల్లికుదురు(రామన్నగూడెం)-2, నైనాల, బ్రాహ్మణకొత్తపల్లి, ఆలేరు, చిన్నముప్పారం, రాజులకొత్తపల్లి, రావిరాల, శ్రీరామగిరి, మధనతుర్తి, వావిలాల, మునిగలవీడు, నర్సింహులగూడెం, ఎర్రబెల్లిగూడెం, మేచరాజుపల్లి, కొత్తగూడ మండలంలో బత్తులపల్లె, దూర్గారం, గుండంపల్లె, కిష్టాపురం, కొత్తపల్లె, ముస్మి, మైలారం, పొగుళ్లపల్లి, సాదిరెడ్డిపల్లె, తొర్రూరులో అవుతాపురం, చిన్నవంగర, చిట్యాల, పెద్దవంగర, గంట్లకుంట, వడ్డేకొత్తపల్లి, ఆర్సీ తండా, బావోజీతండా, తొర్రూరు, నాంచారిమడూ రు, అమ్మాపురం, హరిపిరాల, చీకటాయపాలెం, గుర్తూ రు, చింతలపల్లి, ఖానాపురం, వెలికట్టె, గోపాలగిరి, మాటేడు, సోమారం, మడిపెల్లి, ఓడీసీఎంసీ పరిధిలో పెనుగొండ, గంగారం, చింతగూడెం, పెద్ద ఎల్లాపూర్
ఐకేపీ ఆధ్వర్యంలో…
గూడూరు, బొద్దుగొండ, అయోధ్యపురం, గాజులగట్టు, నాయక్‌పల్లి, ముడుపుగల్, ఆమనగల్, కంబాలపల్లి, రెడ్యాల, పర్వతగిరి, మల్యాల, వేంనూర్, మాధవపురం, ఇంచుగూడెం, తిమ్మాపూర్, మొండ్రాయిగూడెం, జంగవాణిగూడెం, గోవిందపురం, తాటివారిపల్లి, కర్లాయ్, ముంగిమడుగు, వంతడపుల, బొమ్మకల్, ఉప్పరిగూడెం, పోచంపల్లి, వడ్డేకొత్తపల్లి, పెద్దవంగర, పోచారం, కొరిపెల్లి, రామవరం, గుండెపూడి, తండధర్మారం, ఎల్లంపేట, రాంపురం, మూలమర్రితండా, తాళ్ల ఊకల్, నీలికుర్తి, పీఎస్ గూడెం, వీరారం, గుండంరాజుపల్లి, జయ్యారం, ఉగ్గంపల్లి, అర్పనపల్లి, అన్నారం, మద్దివంచ, గోపాలపురం, కంటాయపాలెం, ఫత్తెపురం, వెంకటాపురం, కొమ్మనపల్లి, చర్లపల్లి, రామన్నగూడెం, చిన్ననాగారం, జగత్రావుపేట, కొత్తపేట, నామాలపాడు, కట్టుగూడెం, వెన్నారం, బంజర, కన్నెగుండ్ల, ఉయ్యాలవాడ, సీరో లు, తాళ్లసంకీస, మోదుగులగూడెం, అయ్యగారిపల్లి, పెద్దతండా.
జీసీసీ ఆధ్వర్యంలో..
కొత్తగూడ, వేలుబెల్లి, ఎదుళ్లపల్లి, ఒటాయి, కొమట్లగూడెం, కమరం, మాచెర్ల, సీతానాగారం, పొనుగోడు, దామరవంచ
ఏఎంసీ ఆధ్వర్యంలో..
కేసముద్రం మార్కెట్ యార్డు, మహబూబాబాద్ మార్కెట్ యార్డ్, తొర్రూరు మార్కెట్ యార్డు, నెల్లికుదురు సబ్ మార్కెట్ యార్డ్, ఇల్లందు గార్ల సబ్ మార్కె ట్ యార్డ్, బయ్యారం సబ్ మార్కెట్ యార్డు. మెప్మా ఆధ్వర్యంలో శనిగపురంలో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.