ఫిబ్రవరిలో ప్రారంభం కానున్న పనులు
హర్షం వ్యక్తం చేస్తున్న జిల్లా ప్రజలు
పరిగి, జనవరి 7: వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు మహర్దశ తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. కేంద్ర ప్రభుత్వం రోడ్ల మరమ్మతులకు చిల్లిగవ్వ కూడా ఇవ్వకున్నా తెలంగాణ ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేస్తున్నది. వికారాబాద్ జిల్లాలోని రోడ్లకోసం రూ.38 కోట్లను కేటాయించింది. ఈ నిధులతో జిల్లాలోని రోడ్ల మరమ్మ తులు, రీ బీటీ, వెడల్పు తదితర పనులను రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో చేపట్టను న్నారు. జిల్లా పరిధిలో 70 రహదారులు ఉండగా 21 ప్రధాన రోడ్లలోని 95 కిలోమీటర్ల రోడ్లకు మరమ్మతులతోపాటు, రీ బీటీకోసం రూ.38కోట్లు మంజూరయ్యాయి. త్వరగా టెండర్లు పూర్తి చేసి వచ్చే నెలలో పనులను ప్రారంభించి మే నెలలో పు పూర్తి చేసేందుకు ఆర్అండ్బీ అధికారులు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నారు.
వర్షాలకు దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ప్రకృతి వైపరిత్యాలతో రోడ్లు గతుకులమయంగా మారినా కేంద్ర ప్రభుత్వం చిల్లిగవ్వ కూడా కేటాయించలేదు. అయినా సీఎం కేసీఆర్ ప్రభుత్వం రోడ్లకు మహర్దశ తీసుకొచ్చేందుకు రూ.1000 కోట్లు విడుదల చేయగా.. అందు లో వికారాబాద్ జిల్లా పరిధిలోని రోడ్ల కోసం రూ.38 కోట్లు కేటాయించింది. ఈ నిధులను రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో రోడ్ల మరమ్మతు, బీటీ నవీకరణ, వెడ ల్పు పనులకు వినియోగించనున్నారు. వికారాబాద్ జిల్లా పరిధి లో 70 రహదారులు ఉండగా అందులో 21 రోడ్ల (సుమారు 95 కిలోమీటర్లు) మరమ్మతు, బీటీ నవీకరణ పనులను చేపట్టనున్నారు. త్వరగా టెండర్లు పూర్తి చేసి పనులను ప్రారంభించేలా అధికారులు ఆర్అండ్బీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రోడ్లకు మరమ్మతులు జరుగనుండటంతో జిల్లావాసులు, వాహనచోదకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నిధుల కేటాయింపుతో రోడ్లకు మహర్దశ
జిల్లాలోని 21 రోడ్లలో సుమారు 95 కిలోమీటర్ల వరకు మరమ్మతులు, బీటీ నవీకరణ తదితర పనులకు రూ. 38 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం నిధులను విడుదల చేయడంతో ప్రధాన రహదారులకు మహర్దశ రానున్నది. దీంతో ఆయా రోడ్లు ఉన్న గ్రామాలకు రవాణా సదుపాయం మరింత మెరుగవనున్నది. ఫిబ్రవరిలో రోడ్డు పనులను ప్రారంభించి మే నెలలోపు పూర్తి చేసేందుకు ఆర్అండ్బీ అధికారులు ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపించారు.
అంచనాలు తయారుచేసి పంపించాం
జిల్లాలోని 95 కిలోమీటర్ల వరకు రోడ్లకు మరమ్మతులు, బీటీ నవీకరణ తదితర పనులకు ప్రభుత్వం రూ. 38 కోట్లను విడుదల చేసింది. ఇప్పటికే అంచనాల ను రూపొందించి, ప్రతిపాదనలు తయారుచేసి ప్రభుత్వానికి పంపిం చాం. ఈ నెలాఖరు లోపు టెండర్ల ప్రక్రియను పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఫిబ్రవరిలో రోడ్డు పనులను ప్రారంభించి మే నెలలోపు పూర్తి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం.