
మిర్యాలగూడ,సెప్టెంబర్ 6 : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలతో రైతులకు తీరని నష్టం వాటిల్లుతుందని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అన్నారు. సోమవారం పట్టణంలోని వెంకటేశ్వర థియేటర్లో ‘రైతన్న’ సినిమాను ఎమ్మెల్యే టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, రైతులతో కలిసి చూశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ చట్టాల వల్ల రైతులు ఆరుగాలం కష్టించి పండించిన పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించే పరిస్థితి ఉండదన్నారు. సినిమా థియేటర్‌కు వచ్చిన సినీ నటుడు ఆర్.నారాయణమూర్తిని ఎమ్మెల్యే అభినందించారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, ఏఎంసీ మాజీ చైర్మన్ చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు జొన్నలగడ్డ రంగారెడ్డి, ఎండీ.షోయబ్ పాల్గొన్నారు.
రైతుల వెన్ను విరుస్తున్న కేంద్రం
హాలియా : రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు మేలు కలిగేలా పథకాలు అమలు చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం వారి వెన్ను విరిచేలా కొత్త చట్టాలు తీసుకొస్తున్నదని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. సోమవారం హాలియా రిక్కల అచ్చిరెడ్డి థియేటర్లో రైతులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి రైతన్న సినిమా చూశారు. అనంతరం సిని హీరో నారాయణ మూర్తితో కలిసి విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలతో నష్టాలు, విద్యుత్ సంస్కరణలతో భవిష్యత్‌లో కలిగే ఇబ్బందులను సినిమాగా తీసిన నారాయణ మూర్తిని అభినందించారు. రైతుల పంటలకు గిట్టుబాట ధర కల్పించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కూరాకుల వెంకటేశ్వర్లు, నాయకులు మలిగిరెడ్డి లింగారెడ్డి, వెంపటి శంకరయ్య, బొల్లం రవి, ఎన్నమల్ల సత్యం, పోశం శ్రీనివాస్, నల్లబోతు వెంకటయ్య, వర్రా వెంకట్‌రెడ్డి, మెండె సైదులు, పిల్లి అభినయ్, అహ్మద్ అలీ పాల్గొన్నారు.