తాండూరు, జనవరి 5: ఒకప్పుడు దండుగ అన్న ఎవుసమే సీఎం కేసీఆర్ ప్రతిష్మాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధుతో నేడు పండుగ అయ్యిందని తాండూరు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ విఠల్ నాయక్, వైస్ చైర్మన్ వెంకట్‌రెడ్డి అన్నారు. బుధవారం తాండూరు వ్యవసాయ మార్కెట్ ఆధ్వర్యంలో రైతు బంధు సంబురాలను ఘనంగా నిర్వాహించారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశా రు. ఎండ్లబండిపై ప్రత్యేక ర్యాలీతో పాటు మహిళ రైతుల ఆటపాటలతో సంక్రాంతి పండుగల సం బురాలు నిర్వహిస్తు తెలంగాణ సర్కార్‌కు రైతులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మార్కెట్ చైర్మన్ విఠల్‌నాయక్, వైస్ చైర్మన్ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ రైతు బంధు సాయం రైతులకు ఎంతో మేలు చేస్తుందన్నారు. టీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రైతులకు పెద్ద పీట వేయడంతో రైతులకు చాల లాభాలు వస్తున్నాయని పేర్కొన్నారు. రైతు కుటుంబాల్లో వెలుగులు నింపుతున్న సీఎం కేసీఆర్‌కు రైతులు ఎల్లప్పుడు రుణపడి ఉంటారని తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి రాజేశ్వరి, పాలక వర్గం సభ్యులు, టీఆర్ఎస్ నేతలు, రైతులు ఉన్నారు.
తాండూరు మండలంలో…
తాండూరు రూరల్, జనవరి 5 : తాండూరు మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం రైతు బంధు సంబురాలు జరుపుకొన్నారు. మండలంలోని అంతారం గ్రామంలో సర్పంచ్ రాములు ఆధ్వర్యంలో రైతు వేదికలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అదేవిధంగా చెంగోల్ గ్రామంలో సర్పంచ్ మల్లీశ్వరీ, మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో రైతులు ఎడ్ల బండి ర్యాలీ నిర్వహించి, రైతు బంధు సంబురాలు ఘనంగా జరుపుకొన్నారు. అంతరాం తండాలో గిరిజన రైతులు సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసి సంబురాలు జరుపుకొన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యురాలు గౌడి మంజుల, పీఏసీఎస్‌చైర్మన్ రవిగౌడ్, ఎంపీటీసీ సాయిరెడ్డి, మహిళా నాయకురాలు శకుంతల, పార్టీ అధ్యక్షుడు రాందాస్ ఉన్నారు