షాద్‌నగర్, జనవరి 4 : టీఆర్ఎస్ అవలంభిస్తున్న రైతు సంక్షేమ విధానాలతో వ్యవసాయం పండుగలా సాగుతున్నది ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. మంగళవారం రైతు బంధు సంబురాల్లో భాగంగా షాద్‌నగర్ పట్టణంలోని మండల పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, అధికారులు మాట్లాడారు. అన్ని వర్గాల రైతుల అభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ రైతు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, రానున్న రోజుల్లో రైతుల శ్రేయ స్సు కోసం రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని నిధులు వెచ్చించనుందని అన్నారు. 2018 యాసంగి కాలం రైతు బంధు నిధుల నుంచి ఈ యేడు యాసంగి కాలం రైతు బంధు నిధుల వరకు రైతుల ఖాతాల్లో రూ. 50 వేల కోట్లను ప్రభుత్వం జమచేసిందని చెప్పారు. రైతులకు రూ. 50 వేల కోట్ల నిధులు అందించిన శుభ సందర్భంగా రైతు బంధు సంబురాలు జరుపుకోవాలని పిలుపునిచ్చారు. రైతు బంధు ప్రాముఖ్యత, ప్రయోజనాలను ప్రజలకు మరింత వివరించాలన్నారు. సమావేశంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, ఎంపీపీలు ఖాజ ఇద్రీస్, వై. రవీందర్‌యాదవ్, మధుసూదన్‌రెడ్డి, జడ్పీటీసీలు పి. వెంకట్రాంరెడ్డి, తాండ్ర విశాల, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వంకాయల నారాయణరెడ్డి, గ్రా మాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, రైతు సమన్వ య సమితి అధ్యక్షులు, అధికారులు ఉన్నారు.
ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ
షాద్‌నగర్‌టౌన్ : ప్రజల ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. మున్సిపాలిటీలోని నెహ్రూనగర్కాలనీకి చెందిన విష్ణుమూర్తికి రూ. 25వేలు, కొత్తూరు మండలంలోని వైఎం తండాకు చెందిన గణేశ్‌కి రూ. 60 వేలు, రెడ్యాకి రూ. 46, 500, మల్లాపూర్ గ్రామానికి చెందిన జార్జిరెడ్డికి రూ. 60 వేలు, సిద్దాపూర్ గ్రామానికి చెందిన జంగయ్యకి రూ. 15 వేలు, రెడ్డిపాలెం గ్రామానికి చెందిన వంశీకి రూ.60 వేలు, తీగపూర్ గ్రామానికి చెందిన ఆంజనేయులుకి రూ. 60 వేలు, రమేశ్‌కి రూ.54వేలు, ఇన్ముల్‌నర్వకు చెందిన కృష్ణకి రూ.16 వేల సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారికి సీఎం సహాయనిధి కొండంత అండగా నిలుస్తుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
పర్వదినాలను సంతోషంగా జరుపుకోవాలి
ప్రతి ఒక్కరూ పర్వదినాలను సంతోషంగా జరుపుకోవాలని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని వాసవీక్లబ్, లయన్స్‌క్లబ్ సహకారంతో షాద్‌నగర్ ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో డీఎం సురేఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. పండుగను కొవిడ్ నిబంధనలను పాటిస్తూ జరుపు కోవాలన్నారు. ముగ్గుల పోటీల్లో గెలుపొందిన చిన్నారులకు, మహిళలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఎంఎస్ నటరాజ్, ఎంపీపీ మధుసూదన్‌రెడ్డి, కౌన్సిలర్లు సర్వర్‌పాషా, శ్రీనివాస్, కొత్తూరు టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కృష్ణ, మల్లాపూర్, ఎనుగులమడుగు తండా సర్పంచ్‌లు సాయిలు, అరుణ, నాయకులు జూపల్లి శంకర్, సత్యనారాయణ, రమేశ్, దర్శన్ పాల్గొన్నారు.