బతుకమ్మ చీరెలు ఇంట్లో దాచి పాత వాటిని తగులబెట్టారు
ప్రతిపక్షాల కుట్రలను ప్రజలు గమనిస్తున్నారు
బతుకమ్మ చీరెల పంపిణీలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
చిట్యాల, అక్టోబర్ 3 : దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వాన్ని ఓర్వలేని ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు కుట్రలు పన్నుతున్నాయని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. కైలాపూర్ గ్రామంలో బతుకమ్మ చీరెలను తగలబెట్టారని వచ్చిన వార్తల్లో నిజం లేదని, పంపిణీ చేసిన చీరలను ఇంట్లో దాచుకుని పాతచీరెలను దహనం చేశారని ఆయన పేర్కొన్నారు. మండలంలోని కైలాపూర్లో బతుకమ్మ చీరెలను దహనం చేసిన మహిళలు శీర్షికన కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలను గమనించిన ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆదివారం గ్రామానికి చేరుకుని వాస్తవాలు తెలుసుకున్నారు. లబ్ధిదారులకు బతుకమ్మ చీరెలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ చింతల శ్వేతాసుమన్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బతుకమ్మ పండుగకు కానుకగా తెలంగాణ ప్రభుత్వం మహిళలకు చీరెలను పంపిణీ చేస్తున్నదన్నారు. ఆడబిడ్డల ఆనందం కోసమే రాష్ట్ర ప్రభు త్వం ప్రతి మహిళకు బతుకమ్మ చీరెను అందజేస్తున్నదన్నారు. తెలంగాణ మహిళలకు ముఖ్యమైన అతిపెద్ద పండుగ బతుకమ్మ పండుగన్నారు. ఎంతో భక్తి శ్రద్ధలతో ఇలాంటి పండుగను పేద కుటుంబాలు సైతం ఆనందంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ చీరెలను అందజేస్తున్నారన్నారు. అనంతరం జడ్పీటీసీ గొర్రెసాగర్ మండలంలోని నైన్పాక, గుంటూరుపల్లి గ్రామాల్లో నిర్వహించిన చీరెల పంపిణీ కార్యక్రమాలకు అతిథిగా హాజరై అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దావు వినోద, పీఏసీఎస్ చైర్మన్ కుం భం క్రాంతి కుమార్రెడ్డి, వైస్ చైర్మన్ ఏరుకొండ గణపతి, ఎంపీటీసీ కట్కూరి పద్మానరేందర్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఆరెపెల్లి మల్లయ్య, గ్రామ అధ్యక్షుడు దానవేన రమేశ్, నాయకులు కర్రె ఆశోక్రెడ్డి, వెంకన్న, రాజేందర్ పాల్గొన్నారు.
బతుకమ్మ చీరలపై ఆరోపణలు సరికాదు
కాటారం : వ్యాప్తంగా ఆడబిడ్డలకు ఆత్మీయ కానుకగా సీఎం కేసీఆర్ బతుకమ్మ చీరెలు పంపిణీ చేస్తుంటే కాంగ్రెస్ నాయకులు అనవసర రాద్దాంతం చేయడం సరికాదని టీఆర్ఎస్ మండల మహిళా అధ్యక్షురాలు ఎలుబాక సుజాత, మండల ప్రచార కార్యదర్శి మమత అన్నారు. ఆదివారం వారు విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ఆడపడుచులు ఆత్మగౌరవంతో బతుకమ్మ వేడుకలను జరుపుకునేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నదన్నారు. సీఎం కేసీ ఆర్కు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే కాం గ్రెస్ నాయకులు చేస్తున్నారన్నారు.