మండలంలో రూ.22.38 కోట్ల విలువైన 1.14 లక్షల క్వింటాళ్ల సేకరణ
బొంరాస్‌పేట, జనవరి 3: మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ఈ ఏడాది వానకాలం సీజన్లో దండిగా ధాన్యం వచ్చింది. ఈ ఏడాది వర్షాకాలంలో వానలు సమృద్ధిగా కురవడంతో చెరువులు, కుంటలు నిం డడం, బోర్లలో భూగర్భ జలాలు పెరగడంతో వానకాలంలో రైతులు వరి పంటను గణనీయంగా పండించారు. దీంతో పాటు కొత్తరకం వంగడాలతో నాటు వేయడంతో దిగుబడులు కూడా గణనీయంగా పెరిగిన ఫలితంగా కేంద్రాలకు ధాన్యం పోటెత్తింది. జిల్లాలో రికార్డు సాలంలో 2 వేల ఎకరాల్లో వరి పండించారు. వరి ధాన్యాన్ని ఈ ఏడాది కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ధాన్యాన్ని అమ్ముకోవ డానికి రైతులు ఇబ్బం దులు పడకుండా ఉండేందుకు మండలంలో 12 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఐదు, ఐకేపీ ఆధ్వర్యంలో 7 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. కొనుగోలు కేంద్రాల్లో అమ్మితే ఏ గ్రేడు ధాన్యానికి రూ.1960లు, బీ గ్రేడు ధాన్యానికి రూ.1920 లు చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకే తెస్తున్నారు. ధాన్యంలో తేమ శాతం ఎంత ఉందో పరిశీలించి తూకం వేసి దాని ప్రకారమే ధర చెల్లిస్తున్నారు. ధాన్యంలో తాలు, మట్టిని తొలగించడానికి కొనుగోలు కేంద్రాలకు ప్రభుత్వం యంత్రాలను సరఫరా చేసింది. వాటి ద్వారా తాలు, మట్టిని తొలగిస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లలో ఈ ఏడాది ప్రభుత్వం ఓటీపీ విధానాన్ని అమలు చేసింది. తూకం వేసిన వెంటనే వాటి వివరాలను ట్యాబ్‌లో అప్లోడ్ చేస్తున్నారు. వారం రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బు జమ అవుతుంది.
మండలంలోని 12 ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఆదివారం నాటికి 22. 38 కోట్ల విలువైన 1.14 లక్షల క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. నాగిరెడ్డిపల్లిలో 8791, చిల్ముల్మైలారంలో 14422, చౌదర్పల్లిలో 6480, గౌరారంలో 9630, మెట్లకుంటలో 12599 , బొంరాస్‌పేటలో 14828 , దుద్యాలలో 11580, ఏర్పుమళ్లలో 14137, నాందార్‌పూర్‌లో 8040, బురాన్‌పూర్‌లో 12284, లగచెర్లలో 10669, కొత్తూరులో 17743 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశారు. కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు దాదాపు తుది దశకు చేరుకుంది. కొనుగోలు కేంద్రాలలో తూకం చేసిన ధా న్యాన్ని వెంట వెంటనే రైస్ మిల్లులకు తరలించారు. దీంతో కొనుగోలు కేం ద్రాలలో ధాన్యం బస్తాలు ఖాళీ కావడంతో రైతులు తెచ్చిన ధాన్యాన్ని వెంట వెంటనే తూకం చేయడానికి అవకాశం కలిగింది.
వారంలోనే పైసలు జమ
ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు రైతులకు ఎంతో ఉపయోగంగా ఉన్నా యి. గతంలో కొనుగోలు కేంద్రాలు లేనప్పుడు మార్కెట్‌కు తీసుకెళ్లి తక్కువ ధరకు అమ్ముకుని నష్టపోయే వారం. ఇప్పుడు ప్రభు త్వం ప్రక టించిన మద్ధతు ధరకే గ్రామంలోనే ధాన్యాన్ని అమ్ముకుం టున్నాం. వారం రోజుల్లోనే ఖాతాలో డబ్బులు పడుతున్నాయి.- రవీందర్, రైతు మెట్లకుంట