
అందోల్, డిసెంబర్ 1 : ఎయిడ్స్ వ్యాధిపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జోగిపేట డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గోపాల్ సూచించారు. బుధవారం జోగిపేటలో పాఠశాల విద్యార్థులు, ఎన్సీసీ కేడెట్లతో కలిసి ఎయిడ్స్‌పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులపై చులకనభావం తగదన్నారు. సమాజంలోని ఎయిడ్స్ బాధితులకు ప్రతిఒక్కరూ అండగా నిలవాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ఎయిడ్స్‌పై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్..
పుల్కల్, డిసెంబర్ 1 : ప్రపంచ ఎయిడ్స్ దినాన్ని పురస్కరించుకొని బుధవారం మండల కేంద్రమైన పుల్కల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు కళాశాల ప్రిన్సిపాల్ వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎయిడ్స్‌పై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఎయిడ్స్ ఏ విధంగా సంక్రమిస్తుంది.. అది రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. కార్యక్రమంలో అధ్యాపకులు శ్వేత, వి.శంకర్, ముత్తయ్య, నరసింహ, సీహెచ్ శంకర్, విద్యార్థులు పాల్గొన్నారు.