రూ.100 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం
మొదటి విడుతలో 35 శాతం బడుల్లో..
‘మన ఊరు-మన బడి’తో తీరనున్న నిర్వాహకుల ఇబ్బందులు
ప్రభుత్వ నిర్ణయంపై హర్షం
పరిగి, ఫిబ్రవరి 1: పాఠశాలలకు మహర్దశ తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తున్నది. అందులో భాగంగానే మన ఊరు-మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినది. ఇందులో ప్రధానంగా ప్రతి పాఠశాలలోనూ 12 అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించనున్నది. తరగతి గదులు, ప్రహరీలు, ఇతర నిర్మాణాలతోపాటుగా కిచెన్‌షెడ్లను నిర్మించనున్నది. ఇందుకు సంబంధించి మొదటి విడుత లో కిచెన్‌షెడ్ల నిర్మాణానికి రూ.100 కో ట్లను కేటాయించనుంది. జిల్లా పరిధి లో ప్రాథమిక పాఠశాలలు-764, ప్రాథమికోన్నత పాఠశాలలు-116, ఉన్నత పాఠశాలలు-174, టీఎస్ఎంఎస్లు-9, కేజీబీవీలు-18, టీఎస్ గురుకులా లు 26 ఉన్నాయి. వీటిలో సుమారు లక్షా10 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈసారి జిల్లాలో అత్యధికంగా విద్యార్థులు ఉన్న 35శాతం పా ఠశాలలను ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం కింద ఎంపిక చేసి మౌలి క వసతులు కల్పించనున్నారు.
జిల్లాలో 392 కిచెన్‌షెడ్ల నిర్మాణం
జిల్లా పరిధిలో 1,058 పాఠశాలలు ఉండగా 666 పాఠశాలల్లో కిచెన్షెడ్లు ఉన్నాయి. జిల్లాలో 392 పాఠశాలల్లో కిచెన్‌షెడ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉన్నది. మొదటి విడుతగా ఎంపికయ్యే 35 శాతం పాఠశాలల్లో ఏ, ఏ స్కూళ్లలో కిచెన్షెడ్లు అవసరమనేది గుర్తించి, ఆ యా బడుల్లో విద్యార్థులకు వంట చేసి పెట్టేందుకు వీలుగా వీటిని మన ఊరు-మన బడి కార్యక్రమం కింద నిర్మించనున్నారు. కిచెన్షెడ్లు లేని చోట వ ర్షాకాలం, చలికాలం, ఎండాకాలాల్లో వంట చేసేందుకు నిర్వాహకులకు పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని బడుల్లో కిచెన్షెడ్లు ఉండేలా ఈ ప్రభు త్వం తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం అవుతున్నది. అదేవిధంగా శిథిలావస్థకు చేరి న కిచెన్షెడ్లు ఉన్న బడుల్లో మరమ్మతులు చేయించే అవకాశాలు ఉన్నాయి.
విద్యార్థుల కోసం డైనింగ్‌హాళ్లు..
విద్యార్థులు ఒకేచోట కూర్చొని మధ్యాహ్న భోజనం చేసేందుకు వీలుగా స్థలం ఉన్న పాఠశాలలు, విద్యార్థుల సంఖ్య అధికంగా ఉన్నచోట డైనింగ్హాళ్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు మొదటి విడుతలో ఎం పికయ్యే పాఠశాలల్లో రాష్ట్ర వ్యాప్తంగా డైనిం గ్ హాళ్ల నిర్మాణానికి రూ.700 కోట్లను ఖ ర్చు చేయడం జరుగుతుంది. జిల్లాలో ఉన్న త పాఠశాలలు-174 ఉండగా, అందులో 200 మంది విద్యార్థులకు పైగా ఉన్నటువం టి జడ్పీహెచ్ఎస్లు-71 ఉన్నాయి. ప్రాథమికోన్నత పాఠశాలలు-116ఉండగా అం దులో 110 మంది విద్యార్థుల కంటే అధికంగా ఉన్న బడులు 50 ఉన్నాయి. అదేవిధంగా ప్రాథమిక పాఠశాలలు-764 ఉం డగా, అందులో 50 మందికి పైగా విద్యార్థులున్నవి 300 పాఠశాలలు ఉన్నాయి. ఈ ఏడాది విద్యార్థులు అధికంగా ఉన్న 35 శాతం పాఠశాలలను ఎంపిక చేసి అవసరమైన మేరకు స్థలం ఉన్న చోట డైనింగ్ హాళ్ల నిర్మాణాలను చేపట్టనున్నారు. తద్వారా విద్యార్థులు చెట్లకింద, వరండాల్లో కూర్చొని భోజనం చేయకుండా అందరూ ఒకే దగ్గర డైనింగ్హాళ్లలో కూర్చొని భోజనం చేయొ చ్చు. కిచెన్‌షెడ్లను ఆనుకొని ఈ డైనింగ్హాళ్లను నిర్మించనున్నారు. అంతేకాకుండా ప్రతి పాఠశాలకూ పెయింటింగ్ వేయించనున్నారు. మొదటి విడుత ఎంపికయ్యే పాఠశాలల భవనాలకు పెయింటింగ్ కోసం సు మారు రూ.500 కోట్లు ఖర్చు చేయనున్నా రు. భవనాలకు పెయింటింగ్ వేయించడంతోపాటు గదుల్లో ఆకర్షణీయంగా, విద్యార్థులకు ఉపయోగపడేలా పెయింటింగ్‌లు వే యించే అవకాశం ఉన్నది. ఏదిఏమైనా అ న్ని వసతులు కల్పించడంతోపాటు పెయింటింగ్‌లతో పాఠశాలల భవనాలు మరింత సుందరంగా మారనున్నాయి.