మాస్కులు ధరించి, శానిటైజ్ చేస్తూ తరగతి గదిలోకి అనుమతి
పలుచోట్ల పచ్చని తోరణాలతో అలంకరణ
ఇబ్రహీంపట్నం రూరల్, ఫిబ్రవరి 1 : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మంగళవారం పాఠశాలలు కొవిడ్ నిబంధనల మధ్య ప్రారంభించారు. పాఠశాలలకు వచ్చే విద్యార్థులు తప్పనిసరిగా మాస్కు ధరించారు. పాఠశాల గేటు వద్ద శానిటైజర్ ఏర్పాటు చేశారు. ఆదిబట్ల ప్రాథమిక పాఠశాలను మామిడి తోరణాలతో అందంగా అలంకరించి పచ్చని వాతావరణంలో విద్యార్థులను తరగతులకు ఆహ్వానించారు. ప్రతి పాఠశాల గేటు వద్ద నోమాస్కు నో ఎంట్రీ బోర్డులను ఏర్పాటు చేశారు.
షాద్‌నగర్‌టౌన్ : కరోనా వ్యాప్తి నేపథ్యంలో మూ తపడిన పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. కొవి డ్ నిబంధనలను పాటిస్తూ విద్యార్థులు తరగతలకు హాజరయ్యారు. పట్టణంలోని జడ్పీహెచ్ఎస్లో ఇన్చార్జి హెచ్ఎం రమేశ్ శానిటైజర్‌తో చేతులను శుభ్రం చేయించారు. కరోనా జాగ్రత్తలు పాటించాలన్నారు.
కొత్తూరు : కొవిడ్ ఆంక్షలు సడలించడంతో మంగళవారం పాఠశాలలు తెరుచుకున్నాయి. పాఠశాలల్లో శానిటేషన్ పనులు చేపట్టారు. మున్సిపల్ సిబ్బంది తరగతి గదులు, పాఠశాల ఆవరణను శుభ్రం చేశారు. 445 మందికి 99 మంది హాజరయ్యారని కొత్తూరు జడ్పీహెచ్ఎస్ హెచ్ఎం భాగ్యమ్మ తెలిపారు.
యాచారం : ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయు లు శానిటైజర్ చేయించి, పరిసరాలను శుభ్రం చేశా రు. విద్యార్థులందరూ మాస్కులు దరించేలా భౌతిక దూరాన్ని పాటించేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకున్నారు. మొదటి రోజు విద్యార్థుల సంఖ్య ఆశించిన స్థాయిలో లేనప్పటికి క్రమంగా పెరిగే అవకాశముందని ఉపాధ్యాయులు పేర్కొన్నారు.