
సర్వమానవాళి పాప ప్రక్షాళన కోసం అవనిపై అవతరించిన కరు ణామయుడిని ఆరాధించే ప్రార్థనా మందిరం.. ప్రశాంతతకు నిల యం.. శాంతి, ప్రేమ, అహింస, ప రోపకారం, సోదరభావాలను సం దేశంగా ప్రకటించే పవిత్ర స్థలం.. క రువుకాలంలో అన్నార్థులను ఆదు కున్న అమృతహస్తం. విదేశీ నైపుణ్యం, కళాత్మక నిర్మాణంతో కనువిందు చేసే అత్యద్భుత కట్టడం. అతి సుందర మం దిరంగా.. ఆసియా ఖండంలో రెండో అ తి పెద్ద చర్చిగా.. రెండో వాటికన్గా పేరు గాంచింది మెదక్ కేథడ్రల్ చర్చి. ఈ పుణ్య క్షేత్రాన్ని ఇంగ్లాం డ్కు చెందిన రెవరెండ్ చార్లెస్ వాకర్ పాస్నెట్ ఆధ్వర్యంలో 1914 నుంచి 1924 వరకు పదేండ్ల పా టు నిర్మించగా, ఇప్పటికీ చెక్కుచెదరని అందంతో ఆకట్టుకుంటున్నది. చర్చి నిర్మా ణంలో మెదక్ ప్రాంతానికి చెందిన కూలీలు ప్రధాన పాత్ర పోషించగా, ప్రస్తుతం తెలంగా ణకే తలమానికంగా భాసిల్లుతోంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా ముఖ్య మంత్రి హోదాలో సీఎం కేసీఆర్ 2014లో చర్చిని సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కాగా, ఈ నెల 25న క్రిస్మస్ పర్వదినం సందర్భంగా 97 ఏండ్లు పూర్తి చేసుకున్న ఈ మహా కట్టడంపై ప్రత్యేక కథనం.
మొదటి ప్రపంచ యుద్ధం ఆరంభం.. నిజాం పాల నలో కరువు రక్కసి తాండవిస్తున్న సమయ మది.. ఆకలి కేకలతో ప్రజలు విలవిల్లా డుతున్న రోజు లవి. మెదక్ ప్రాంతంలో పనులు లేక, తినేందుకు మె తుకు దొరక్క ప్రజలు అలమటించారు. మూడేండ్ల పాటు పీడించిన ఈ కరువు బీభత్సానికి ఇంగ్లాండ్ రన్కోడ్ పట్టణానికి చెందిన రెవరెండ్ చార్లెస్ వాకర్ పాస్నెట్ చలించిపోయారు. తన వద్ద చిల్లిగవ్వ లేకున్నా మెదక్ ప్రాంత ప్రజలకు బుక్కెడు బువ్వ పెట్టాలని సంకల్పించా రు. తన ఇష్ట దైవం ఏసుకు అద్భుతమైన మందిరం నిర్మించడంతో పాటు కరువు పీడితుల్ని ఆదుకునే లక్ష్యంతో అతిపెద్ద కేథడ్రల్ చర్చి నిర్మాణా నికి శ్రీకారం చుట్టారు. పనికి ఆహార పథకం కింద 1914 నుంచి 1924 పదేండ్ల కాలంలో పాస్నెట్ ఆధ్వర్యంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెదక్ చర్చి నిర్మా ణం జరిగింది. బర్మా నుంచి బియ్యం, ఆహార పదార్థాలు తెప్పించి కూలీలకు అందించి పనులు చేపట్టారు. ఈ నిర్మాణంలో తెలంగాణ ప్రాంత కూలీలు భాగస్వాములవగా, ఈ చర్చి ఆసియాలోనే రెండో అతిపెద్ద క్రైస్తవ పుణ్య క్షేత్రంగా విరాజిల్లుతోంది.
చర్చిలో భారీ ఏర్పాట్లు
ఈ నెల 25న క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని బిషప్ సాల్మన్‌రాజ్ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మెదక్ చర్చిని రంగు రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించగా, చూపరులను ఎంతో ఆకట్టుకుంటున్నది. బస్‌డిపో వద్ద ఉన్న ముఖద్వారం నుంచి మొదలుకొని మందిరం వరకు ఇరువైపులా లైట్లతో అందంగా ముస్తాబు చేశారు. విద్యుత్ కాంతులతో చర్చి ధగధగలాడుతుండగా, నాలుగైదు రోజుల పాటు జాతర జరుగనున్నది. తెలుగు రాష్ర్టాలే కాకుండా పక్క రాష్ర్టాలైన కర్ణాటక, మహారాష్ట్రలతో పాటు విదేశాల నుంచి భక్తులు లక్షల సంఖ్యలో హాజరుకానున్నారు.
మెదక్ పట్టణ నడిబొడ్డున రూపుదిద్దుకు న్న చర్చి 97ఏండ్లు పూర్తి చేసుకుంది. ఎంతో మంది మేధావులు, రచయితలు ఈ చర్చి విశిష్టతను ప్రశంసించారు. అయితే, నిర్మాణ సమయంలో అవసరాలకు తగ్గట్టుగా నిపుణులు, పనివారు లభించక ఇబ్బందులు ఎదుర్కొనగా, త యారు చేసి సిద్ధంగా ఉన్న భాగాలను కేవలం బి గించి పనిచేయడం అనే నూతన విధానం ద్వారా దేశంలోనే మొదటిసారిగా ఈ చర్చి నిర్మాణం చేపట్టి ఆధునిక ఇంజినీరింగ్‌కు పునాది వేశారు పాస్నెట్. ఇది క్రైస్తవుల మందిరమైనా విభిన్న మతాలకు చెందిన వేలాది మంది వస్తుంటారు.
173 అడుగుల ఎత్తు..
చర్చిని 180 అడుగుల ఎత్తుతో నిర్మించాలని పాస్నెట్ తలంచారు. ఈ మేరకు నిర్మాణ అనుమ తి కోసం నిజాంకు దరఖాస్తు చేయగా, అప్పటికే నిజాం రాజ చిహ్నంగా హైదరాబాద్‌లో ఉన్న చా ర్మినార్ ఎత్తు 175 అడుగులు ఉంది. దీంతో అం తకంటే ఎక్కువ ఎత్తులో చర్చి నిర్మించేందుకు ని జాం అనుమతించలేదు. దీంతో 173 అడుగుల ఎత్తుతోనే చర్చి నిర్మించేందుకు పాస్నెట్ నిర్ణయించారు. చర్చి ప్రధాన గోపురం ఎత్తు 173 అడుగు లు, వెడల్పు 100 అడుగులు, పొడువు 200 అ డుగులు ఉంది. చర్చి పూర్తిగా రాతితో డంగుసు న్నం వినియోగించి పటిష్టంగా నిర్మించారు.
కళాత్మకం.. ప్రార్థనా మందిరం..
చర్చి నిర్మాణంలో నేటి ఇంజినీర్లకు సైతం ఊ హకందని నైపుణ్యాలు ఒక ప్రత్యేకత కాగా, అద్దా ల కిటికీలు మరో ప్రత్యేకత. క్రీస్తు జీవితంలోని ప్ర ధాన ఘట్టాలను ఎంతో కళాత్మకంగా కళ్లకు కట్టేలా అద్దాల కిటికీల్లో పొందుపర్చడం విశేషం. ఇంగ్లాడ్‌కు చెందిన ప్రముఖ చిత్రకారుడు ఓ సాలిస్ బరి స్టెయిన్ గ్లాసు ముక్కలతో ఈ కిటికీలకు రూపకల్పన చేశారు. మూడు దశల్లో వీటిని ఏర్పాటు చేయగా, ముందుగా 1927లో చర్చిలోపల ఎదురుగా ఉన్న వేదికపై ఉన్న కిటికీ అద్దాల్లో క్రీస్తు ఆరోహణకు సంబంధించిన దృశ్యాలు పొందుపర్చారు. ఆ తర్వాత 1947లో చర్చిలో కుడివైపున ఉన్న కిటికీ అద్దాల్లో ఏసుక్రీస్తు జననం, 1958లో క్రీస్తు సిలువపై వేలాడుతున్న దృశ్యాలను ఏర్పాటు చేశారు. బయటి నుంచి సూర్యకాంతి ప్రసరించినప్పుడు మాత్రమే చర్చిలోపల నుంచి చూస్తే కిటికీ అద్దాల్లో నిక్షిప్తమైన దృశ్యాలు కనిపించడం ప్రత్యేకత. అలాగే, మందిరంలో ఆర్చ్‌లు, పైకప్పు, ఫ్లో రింగ్ మాత్రమే కాదు.. వేదికపై టేబుళ్లు, కుర్చీలు సైతం కళాత్మకంగా తీర్చిదిద్దారు. ప్రధాన వేదికపై ఉండే ప్రభు భోజనపు టేబుల్ రంగూన్ టేకుతో తయారు చేశారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ పఠన వేదిక దేవదారు కర్రతో పక్షిరాజు రూపంలో ఎంతో అద్భుతంగా మలిచారు. జెకొస్లోవియా దేశానికి చెందిన పనివారు నిజమైన పక్షిని తలపించేలా దీనిని రూపొందించారు. గురువుల కోసం రోజ్‌వుడ్‌తో బల్లాలు, కుర్చీలు తయారు చేశారు.
నిర్మాణానికి 200 నమూనాలు
చర్చిని చాలా పెద్దగా, సుందరంగా నిర్మించాలని పాస్నెట్ సుమారు వెయ్యి ఎకరాల స్థలాన్ని కొన్నారు. చర్చి నిర్మాణ నమూనా రూపకల్పన కోసం ఇంగ్లాండ్ వెళ్లి ఇంజినీర్ అయిన తన మిత్రుడు బ్రాడ్షాను కలిసి తన ఆలోచన పంచు కున్నాడు. ఈ మేరకు బ్రాడ్షా సృజనాత్మకంగా ఆలోచించి చర్చి నిర్మాణానికి 200 నమూనాలు గీసి ఇచ్చాడు. వాటిని తీసుకొని మెదక్ తిరిగి వచ్చిన పాస్నెట్ ఏ నమూనా ప్రకారం చర్చి నిర్మించాలో అనే ఆయోయమ స్థితిలో పడిపోయాడు. ఒక రోజు చర్చి నిర్మించాలనుకుంటున్న ప్రదేశంలో ఒక ఎత్తైన గుట్టపై 200 నమూనాలను ఉంచి ఏసుక్రీస్తును ప్రార్థించాడట. అతను ప్రార్థన ముగించేసరికి గాలికి నమూనా కాగితాలన్నీ ఎగిరిపోయి చివరకు ఒక నమూనా మాత్రమే అక్కడ మిగిలిందట. దీంతో ఏసుప్రభువే ఆ నమూనాను ఎంపిక చేశారని, అది దైవనిర్ణయంగా భావించి చర్చి నిర్మాణం ప్రారంభించారు.
మొదటి సారి చర్చిని సందర్శించిన సీఎం కేసీఆర్..
రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా ముఖ్య మంత్రి హోదాలో కే. చంద్రశేఖర్‌రావు 2014లో మెదక్ వచ్చిన సందర్భంగా చర్చిని సందర్శించారు. అప్పటి ప్రెసిబేటరీ ఇన్‌చార్జ్జి రాబిన్సన్ సీఎం కేసీఆ ర్ను ఘనంగా సన్మానించారు. అప్పటి మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, మెదక్ ఎంపీ కొత్త ప్రభా కర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, స్వర్గీయ సోలిపేట రామలింగారెడ్డి, మదన్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి సీఎం కేసీఆర్ వెంట ఉన్నారు. దివంగత ప్రధాని ఇందిరాగాంధీతో పాటు పలువురు సీఎంలు, మంత్రులు, గవర్నర్లు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, జడ్జిలు, వివిధ దేశాల ప్రముఖులు చర్చికి వచ్చారు.