
అందోల్, ఆగస్టు 6: జయశంకర్ సార్ జయంతి వేడుకలను అందోల్ మండలంలో శుక్రవారం టీఆర్ఎస్, యువజన సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ బాలయ్య, జడ్పీటీసీ రమేశ్, ఎంపీడీవో సత్యనారాయణ సార్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మల్లికార్జున్, మాజీ చైర్మన్ నాగభూషణం, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు వెంకటేశం పాల్గొన్నారు.
చౌటకూర్‌లో
చౌటకూర్,ఆగస్టు 6 : జయశంకర్ సార్ జయంతి వేడుకలను తహసీల్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్ కిష్టయ్య ఆధ్వర్యంలో జయశంకర్ సార్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఉప తహసీల్దార్ మహేశ్‌కుమార్, ఆర్ ఐ శ్రీనివాస్, వీఆర్వో, వీఆర్ ఏలు సిబ్బంది పాల్గొన్నారు.
కల్హేర్‌లో…
కల్హేర్, ఆగస్టు 6: ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ అభివృద్ధి చెందుతుందనే భావనతో తెలంగాణ ఉద్యమానికి ప్రొఫెసర్ జయశంకర్ ఊపిరి పోశారని జడ్పీటీసీ నర్సింహారెడ్డి, ఎంపీపీ గుర్రపు సుశీల, తహసీల్దార్ జైరాం అన్నారు. జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఆత్మకమిటీ చైర్మన్ రాంసింగ్, ఎంపీడీవో మంజుల, ఎం పీవో శ్రీనివాస్, ఎంపీపీ ఉపాధ్యక్షుడు నారాయణరెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నారాయణరావు, ఎంపీటీసీ సంగప్ప, మండల కోఆప్షన్ మెంబర్ ఘని, పీఏసీఎస్ చైర్మన్ గంగారెడ్డి పాల్గొన్నారు.
దిగ్వాల్లో
కోహీర్, ఆగస్టు 6: దిగ్వాల్ తదితర గ్రామాల్లో ప్రొ.జయశంకర్ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ రియాజ్, రామలింగారెడ్డి, రియాజ్, కరణ్, శివకుమార్, యాదయ్య పాల్గొన్నారు.
రాయికోడ్ మండలంలో
రాయికోడ్, ఆగస్టు 6: మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో జయశంకర్ సార్ జయంతిని నిర్వహించారు. రాయికోడ్ ఎంపీడీవో కార్యాలయంలో జయశంకర్ సార్ చిత్రపటానికి జిల్లా జడ్పీటీసీల ఫోరం అధ్యక్షుడు మల్లికార్జున్‌పాటిల్, తహసీల్దార్ రాజుగౌడ్, పూలమాలలు వేసి, నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీడీవో వెంకటేశం, పీఆర్ ఏఈ శశికుమార్, ఎంపీవో శ్రీకాంత్‌గౌడ్, ఎంపీటీసీలు మొగులప్ప,నిరంజన్ ఉన్నారు.
చీలపల్లి పాఠశాలలో
ఝరాసంగం,ఆగస్టు 6 : చీలపల్లి పాఠశాలలో జయశంకర్ సార్ జయంతిని ఘనంగా నిర్వహించారు. జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి నాగరాజ్, పాఠశాల హెచ్ఎం అమృత్, అంగన్వాడీ టీచర్లు లక్ష్మి, ఎల్లమ్మ, గ్రామ పెద్దలు ఫారుఖ్పటేల్, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
పుల్కల్లో…
పుల్కల్ రూరల్, ఆగస్టు 6 : ప్రొఫెసర్ ఆచార్య జయశంకర్ సార్ జయంతి వేడుకలు తహసీల్, ఎంపీడీవో కార్యాలయాల్లో వేర్వేరుగా అధికారులు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీవో మధులత,సూపరింటెండెంట్ షాకీర్ అలీ, సిబ్బంది పాల్గొన్నారు.