భువనగిరి కలెక్టరేట్, మే 1 : షెడ్యూల్ కులాల నిరుద్యోగ యువతకు ఉచిత కోచింగ్ కేంద్రంలో నేరుగా ప్రవేశం కల్పించనున్నట్లు కలెక్టర్ పమేలాసత్పతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం జారీ చేయనున్న వివిధ ఉద్యోగ నియామకాలకు ఏర్పాటు చేసిన శిక్షణ కేంద్రంలో ఖాళీలు ఉన్నందున ఆసక్తి కలిగిన యువత విద్యార్హతల సర్టిఫికెట్లు చూపించి అక్కడే సీట్లు పొందవచ్చని తెలిపారు. మరిన్ని వివరాలకు కార్యాలయ సూపరింటెండెంట్ 9966000972 నంబర్లో సంప్రదించాలని సూచించారు.