యాదాద్రి, ఏప్రిల్ 24:‘యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం అంతర్జాతీయ ఖ్యాతిని గడించేలా రాష్ట్ర ప్రభుత్వం తీర్చిదిద్దింది. పునః ప్రారంభం పూర్తి చేసుకుని స్వయంభువుల దర్శనభాగ్యం భక్తులకు కలిగింది. దాంతో ఈ ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నది. ఆలయానికి నలువైపులా నాలుగు లైన్ల రహదారుల నిర్మాణాలు చేపట్టారు. దాంతో యాదాద్రి సమీపంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు వర్గాల ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో సామాన్య, మధ్యతరగతి ప్రజల అభిరుచులకు అనుగుణంగా వైటీడీఏ పరిధిలో లే అవుట్లు చేసి తక్కువ ధరలకు ప్లాట్లు విక్రయిస్తున్నాం’ అని ‘ల్యాండ్ మార్క్’ సీఎండీ పల్లె రవీందర్‌రెడ్డి తెలిపారు. ఇప్పటికే హిల్ కౌంటీ పేరుతో 350 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసిన వెంచర్ అనతికాలంలోనే విక్రయాలు పూర్తి చేసుకుందని వెల్లడించారు. కొనుగోలు దారుల ఆసక్తి, అభిరుచిని దృష్టిలో ఉంచుకుని తాజాగా యాదాద్రి గండి చెరువు పక్కనే మల్లాపురం రోడ్డుకు అమోఘ పేరుతో లగ్జరీ ప్రాజెక్ట్‌ను ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు.
హిల్ కౌంటీ వెంచర్ మాదిరిగానే నూతన వెంచర్లలోనూ విశాలమైన రహదారులను నిర్మించి బీటీ రోడ్లను వేస్తున్నామని ల్యాండ్ మార్క్ రియల్ ఎస్టేట్ సంస్థ సీఎండీ రవీందర్‌రెడ్డి తెలిపారు. 60 ఫీట్ల ప్రధాన రహదారితో పాటు 40, 30 ఫీట్లతో అంతర్గత రహదారులు, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, విద్యుత్ స్తంభా లు, వీధి దీపాలు, ప్రతి ప్లాట్‌కు నీటి కనెక్షన్లు ఇచ్చి ఫేజ్‌ల వారీగా ఓవర్‌హెడ్ ట్యాంకులను నిర్మించి నీటిని సరఫరా చేస్తున్నామన్నారు. ప్రధాన ద్వారం వద్ద ఆర్చ్, ఫెన్సింగ్ ఏర్పాటుతో నేటి పెట్టుబడే రేపటికి పునాది అనే ఆశయాలతో క్లియర్ టైటిల్‌తో ప్లాట్లను కొనుగోలు చేసే వారికి ల్యాండ్ మార్క్ సంస్థ భరోసా కల్పిస్తున్నదని వివరించారు.
ల్యాండ్ మార్క్ సంస్థ గతంలో మల్లాపురంలో హిల్ కౌంటీ పేరుతో 300 ఎకరాల వెంచర్, నృసింహస్వామి జలాయశం వదద డివైన్ మెడోస్ పేరుతో మరో 350 ఎకరాల స్థలంలో వెంచర్‌ను నిర్మించినట్లు ఆయన తెలిపారు. చట్టబద్ధమైన వెం చర్ చేసి విశాలమైన రహదారులు, పార్క్‌లు, ఆటస్థలాలతో పాటు వసతులు సమకూరుస్తున్నామన్నారు. మైసూర్ బృందావన్ గార్డెన్‌ను తలపించే ఈ వెంచర్‌ను రూపొందించి ప్రజలకు ఆకట్టుకునేలా తీర్చిదిద్దామని, యాదాద్రికి వచ్చే భక్తులు ఆహ్లాదాన్ని పొందడానికి వీలుంటుందని చెప్పారు.
గండిచెరువు సమీపంలోనే అమోఘ సూట్ రూం ప్రాజెక్టును నిర్మిస్తున్నామని ల్యాండ్ మార్క్ సీఎండీ తెలిపారు. మొత్తం 3 ఎకరాల విస్తీర్ణంలో ఒక ఎకరంలో సూట్ రూంల నిర్మాణాలు చేపట్టనున్నట్లు తెలిపారు. దాంతో పాటు మరో 2 ఎకరాల్లో హోటల్స్, కమర్షియల్ కాంప్లెక్స్‌లను నిర్మిస్తామని చెప్పారు. సోమవారం జరిగే భూమి పూజ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, వరంగల్ ఎంపీ పసునూరి రవీందర్‌రెడ్డి పాల్గొంటారని వివరించారు.