భువనగిరిలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి, జడ్పీ చైర్మన్ సందీప్‌రెడ్డితో కలిసి మోడల్ రైతు బజార్ ప్రారంభం రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని, సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. భువనగిరి పట్టణంలో అధునాతన హంగులతో నిర్మించిన మోడల్ రైతు బజార్‌ను ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డితో కలిసి శనివారం ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు తర్వాత నీళ్లు, కరంట్ పుష్కలంగా రావడంతో వ్యవసాయం పండుగలా మారిందని, పంటల ఉత్పత్తులు గణనీయంగా పెరిగాయని అన్నారు. రైతులు, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు, మోడల్ రైతు బజార్లను ప్రభుత్వం నిర్మిస్తున్నదని తెలిపారు. భువనగిరి పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామని, పార్టీలకతీతంగా నాయకులు, ప్రజలు, వ్యాపారస్తులు సహకరించాలని కోరారు.
భువనగిరి అర్బన్, ఏప్రిల్ 23 : టీఆర్ఎస్ ప్రభుత్వం నిరంతరం రైతుల సంక్షేమం కోసం పనిచేసే ప్రభుత్వమని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. భువనగిరి పట్టణంలో రూ.1.56 కోట్లతో అధునాతన హంగులతో నిర్మించిన మోడల్ రైతు బజార్‌ను ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డితో కలిసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా బడుగుల మాట్లాడుతూ.. రైతులు పండించిన కూరగాయలను వారే విక్రయించి లబ్ధిపొందాలని రాష్ట్రంలో మోడల్ రైతు బజార్లు, ఇంటిగ్రేడెట్ మార్కెట్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతులకు న్యాయం, మేలు జరుగుతుందని పేర్కొన్నారు. 14 ఏండ్ల ఉద్యమంలో చూసిన సమస్యలను పరిష్కరించాలని సీఎం కేసీఆర్ రైతులు, కూలీలు, ఉద్యోగులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతోపాటు అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన మహనీయుడని కొనియాడారు. హర్యానా, బీహార్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ర్టాల్లోని ప్రజలు తెలంగాణలో అమలవుతున్న పథకాలు కావాలని అడిగే పరిస్థితి వచ్చిందన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధి కోసం విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి వేల కోట్లు తీసుకొచ్చారని పేర్కొన్నారు.
గతంలో ఈ ప్రాం తం బీడుబారి ఉండేదని, గోదావరి జలాలతో సస్యశ్యామలం అవుతుందన్నారు. హెచ్ఎండీఏ నిధులు రూ.96 కోట్లతో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి భువనగిరి నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతున్నాడని పేర్కొన్నారు. జిల్లా కేం ద్రంలోని మోడల్ రైతు బజార్లో రైతులకే అవకాశం కల్పించి లబ్ధిపొందేలా చూడాలన్నారు.
ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. మోడల్ రైతు బజార్ ప్రారంభం కొంచెం లేటైనా అన్ని హంగులతో లేటెస్ట్గా ప్రారంభించుకున్నామని అన్నారు. రైతు బజార్‌లోని సమస్యలను గతంలో మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్లామని, దాంతో అదనంగా మరో 20 గుంటల స్థలాన్ని సేకరించి పూర్తిస్థాయిలో నిర్మించుకున్నామని తెలిపారు. ఎమ్మెల్యేగా రెండోసారి అవకాశం కల్పించడంతో భువనగిరి నియోజకవర్గ అభివృద్ధికి నిరంతర కృషి చేస్తున్నానని చెప్పారు. పట్టణంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్, నిరాశ్రయుల వసతిగృహం, మోడల్ రైతు బజార్, ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఓపెన్ స్టేడియం, భువనగిరి చెరువుకట్ట మినీ ట్యాంక్‌బండ్, భువనగిరి ప్రధాన రహదారిని అందరి సహకారంతో తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నానని స్పష్టం చేశారు.
పట్టణంలో చేపట్టే ప్రతి పనికీ పార్టీలకతీతంగా నాయకులు, ప్రజలు, వ్యాపారస్తులు సహకరిస్తూ తనను ముందుకు నడిపిస్తున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో భువనగిరి పట్టణాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానన్నారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను త్వరలో ప్రారంభించేందుకు ప్రణాళిక తయారుచేసి సిద్ధం ఉన్నట్లు వెల్లడించారు. జిల్లా ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు 1.20 గుంటల భూమిలో రూ.17 కోట్లతో నూతన చిల్డ్రన్స్ స్పెషాలిటీ దవాఖాన మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
కొన్నేండ్లుగా కిడ్నీ వ్యాధిగ్రస్తులు ప్రైవేట్ దవాఖానలకు వెళ్లి చికిత్స చేసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా జిల్లా ఆస్పత్రిలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వ అనుమతించగా పనులు ప్రారంభమయ్యాయన్నారు. ఏరియా దవాఖానలో అన్నిరకాల వైద్యపరీక్షలు చేసుకునేందుకు వీలుగా అవసరమయ్యే అధునాతన పరికరాల కోసం రూ.6 లక్షలు, దవాఖాన వార్డుల్లో రెండు ఏసీల ఏర్పాటుకు సొంత నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుత వ్యవసాయ మార్కెట్ చిన్నదిగా ఉండడంతో ధాన్యం నిల్వ చేయడానికి స్థలం లేకపోవడంతో పగిడిపల్లి పరిధిలో 17 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించిందని, త్వరలో పనులను ప్రారంభిస్తామని తెలిపారు.
నియోజకవర్గానికి హెచ్ఎండీఏ నిధులు రూ.96 కోట్లు రాగా ఇప్పటికే అన్ని గ్రామాల్లో మౌలిక వసతులు మెరుగుపడ్డాయని స్పష్టం చేశారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నల్లమాస రమేశ్‌గౌడ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమలో మార్కెటింగ్ అడిషనల్ డైరెక్టర్ రవికుమార్, డిప్యూటీ డైరెక్టర్ అజ్మిత్రాజు, జిల్లా అదనపు కలెక్టర్ దీపక్‌తివారీ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జడల అమరేందర్‌గౌడ్, మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు, వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య, పీఏసీఎస్ చైర్మన్ నోముల పరమేశ్వర్‌రెడ్డి, ఎంపీపీ నరాల నిర్మలావెంకటస్వామి, జడ్పీటీసీ బీరు మల్లయ్య, డీఎంఓ సబిత, జిల్లా మార్కెటింగ్ సెక్రటరీ అంజిత్‌రావు, ఏఎంసీ వైస్ చైర్మన్ ఆల్వ మోహన్‌రెడ్డి, డైరెక్టర్లు బోయపల్లి కేశవరెడ్డి, రాంరెడ్డి, వెంకటరమణ, పుండరీకం, హీరేకార్ రమేశ్, భిక్షపతి, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ అబ్బగాని వెంకట్, టీఆర్ఎస్ పట్టణ, మండలాధ్యక్షుడు ఏవీ కిరణ్‌కుమార్, జనగాం పాండు, నాయకులు రాజేశ్వర్‌రావు, రాజేందర్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, రాఘవేందర్‌రెడ్డి, కౌన్సిలర్లు సుధాకర్‌రెడ్డి, స్వాతి, కో ఆప్షన్ సభ్యుడు అఫ్జల్, రమేశ్, మార్కెట్ కమిటీ సిబ్బంది పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందన్నారు. రైతులు అన్నివిధాలా అభివృద్ధి చెందేందుకు సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. పండించిన పంటలను రైతులే స్వయంగా విక్రయించుకునేందుకు వీలుగా మోడల్ రైతు బజార్లను ఏర్పాటు చేస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా.. అది ప్రజా సంక్షేమం కోసం, రైతులకు లబ్ధి చేకూరేలా ఉంటుందని అన్నారు.
జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి మాట్లాడుతూ.. రైతులు పండించిన పంటను అమ్ముకునేందుకు వీలుగా ఏర్పాటు చేసిన మోడల్ రైతు బజార్లో పూర్తిగా రైతులే విక్రయించేందుకు అనుమతివ్వాలన్నారు. గతంలో రైతు బజార్లో మొత్తం దళారులే ఉండేవారని పేర్కొన్నారు. రైతు సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ రైతుబంధు, రైతుబీమాతోపాటు నిరంతర విద్యుత్ అందించి రైతులకు అండగా ఉంటున్నారని పేర్కొన్నారు. కూరగాయల సాగుకు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ రుణాలు అందిస్తుందని తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.