
భువనగిరి అర్బన్, ఆగస్టు 11: కంపెనీ నుంచి గుట్టుచప్పుడు కాకుండా రసాయనాలను చోరీ చేసి విక్రయిస్తున్న వ్యక్తితోపాటు వాటిని కొంటున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బుధవారం డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో డీసీపీ నారాయణరెడ్డి వివరా లు వెల్లడించారు. భూదాన్‌పోచంపల్లి మం డల పరిధిలోని దోతిగూడెం సమీపంలో అప్టిమాస్ డ్రగ్స్ ప్రైవేట్ కంపెనీ ఉంది. ఇం దులో గత కొన్ని రోజులుగా పల్లాడియం కార్బన్, ప్లాటినం మెటల్‌ను(రసాయనాలు) గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేస్తున్నారని కంపెనీ మేనేజర్ రామకృష్ణ ఈనెల 6వ తేదీన భూదాన్‌పోచంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టగా కంపెనీలో షిఫ్టు ఇన్చార్జిగా పనిచేస్తున్న సామ రఘునాథరెడ్డిపై అనుమానం వచ్చింది. అతడిపై పోలీసులు నిఘా పెట్టగా బుధవారం ఉదయం 9 గం టల సమయంలో రఘునాథరెడ్డి పల్లాడియం కార్బన్, ప్లాటినం మెటల్‌ను ఎల్లగిరి ఎక్స్‌రోడ్డు వద్ద కూకట్‌పల్లికి చెందిన లాలూస్వామికి విక్రయిస్తున్నాడు. చౌటుప్పల్ సీఐ సిబ్బందితో వెళ్లి వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. రఘునాథరెడ్డి వద్ద 900 గ్రాముల పల్లాడి యం కార్బన్, కేజీ ప్లాటినం, ఒక సెల్‌ఫోన్, ఒక సేల్ డీడ్ డాక్యుమెంట్, లాలూస్వామి వద్ద 14 కేజీల పల్లాడియం కార్బన్, 3.800 గ్రాముల ప్లాటినం, ఒక సెల్‌ఫోన్, కారు, ఒక వెల్డింగ్మిషన్ను స్వాధీనం చేసుకున్నట్లు, ఆ రసాయనాల విలువ సుమారు రూ.47లక్షల వరకు ఉం టుందన్నారు. ఈ సమావేశంలో చౌటుప్పల్ సీఐ వెంకటయ్య, సిబ్బంది ఉన్నారు.