
ఆలేరు టౌన్, ఆగస్టు 9 : గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందులు వేయించాలని ఏడీ డాక్టర్ ఐలయ్య పేర్కొన్నారు. ఆలేరులో సోమవారం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గొర్రెలు,మేకలకు ఉచితంగా నట్టల మందులు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూగజీవాల సంరక్షణ కోసం విధిగా మందులు వేయించాలన్నారు. గ్రామంలో 1483 గొర్రెలకు, 542 మేకలకు నట్టల మందు వేశారు. ఈ కార్యక్రమంలో పశువైద్యాధికారి నవీన్ రెడ్డి, జల్లి నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.
ఆత్మకూరు(ఎం), ఆగస్టు9: గొర్రెలు, మేకల పెంపకందారులందరూ జీవాల సంరక్షణ కోసం ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న నట్టల నివారణ మందులను వేయించాలని సర్పంచ్ లగ్గాని రమేశ్‌గౌడ్ అన్నారు. సోమవారం మండలంలోని పారుపల్లిలో 2515 గొర్రెలకు, 579 మేకలకు నట్టల నివారణ మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ బండ హంసమ్మ, మండల పశువైద్యాధికారి గిరి, రైతు బంధు సమితి గ్రామ కో ఆర్డినేటర్ మల్లే షం, పశువైద్య సిబ్బంది సుభద్ర, సైదులు పాల్గొన్నారు.
గుండాల, ఆగస్టు 9: మండలంలోని బ్రాహ్మణపల్లి, గంగాపురం గ్రామాల్లో సోమవారం పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో జీవాలకు ఉచిత నట్టల మందును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పశువైద్యాధికారులు గోపీకృష్ణ, యాకూబ్‌లు మాట్లాడుతూ 3362 గొర్రెలు, 634 మేకలకు నట్టల మందు వేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు బండారు సంధ్యాశ్రీనివాస్, దార సైదులు, ఎంపీటీసీ పాయిలి కవిత, పశువైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
బొమ్మలరామారం,ఆగస్టు9:వ్యాధుల బారి నుంచి జీవాలకు టీకాలు వేసి రక్షించుకొవాలని నాగినేపిపల్లి సర్పంచ్ భట్కీర్ బీరప్ప అన్నారు. మండలంలోని హాజీపూర్ , సోటీపేట, చౌదర్ పల్లి,నాగినేనిపల్లి గ్రామాలలోని 2743 గొర్రెలకు,1555 మేకలకు పశుసంవర్ధక శాఖ అధ్వర్యంలో సోమవారం నట్టల నివారణ మందు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు కవిత,పూడూరి నవీన్ గౌడ్, భట్కీర్ బీరప్ప, పశు వైద్యాధికారి సునీత పాల్గొన్నారు.