
అధ్యక్షులతోపాటు సభ్యుల ఎన్నిక
టీఆర్ఎస్ అనుబంధ కమిటీలూ ఏర్పాటు
ఆలేరు రూరల్, సెప్టెంబర్ 3 : మండలంలోని టీఆర్ఎస్ నూతన గ్రామ కమిటీల ఎన్నిక శుక్రవారం నిర్వహించినట్లు ఆ పార్టీ మండలాధ్యక్షుడు గంగుల శ్రీనివాస్, మండల ఎన్నికల ఇన్చార్జి గుంటి మధుసూదన్‌రెడ్డి తెలిపారు. శ్రీనివాసపురం గ్రామశాఖ అధ్యక్షుడిగా వడ్ల అంజయ్య, మంతపురి గ్రామశాఖ అధ్యక్షుడిగా దంతూరి పరశురాములతోపాటు కమిటీ సభ్యులను ఎన్నుకున్నట్లు వారు ప్రకటించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గ్యాదపాక నాగరాజు, నాయకులు కొరుకొప్పుల కిష్టయ్య, కందుల రామన్, కోటగిరి ఆంజనేయులు, మామిడాల భానుచందర్, సిద్దులు, కొంతం శ్యామ్, కందుల శంకర్, శ్రీనివాసపురం సర్పంచ్ వడ్ల నవ్యశోభన్బాబు పాల్గొన్నారు.