దశల వారీగా ప్రతి కుటుంబానికీ అమలు
విపక్షాలది రెండు నాల్కల ధోరణి
ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తే ఖబడ్దార్
వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
పెబ్బేరు మండలం బూడిదపాడులో పల్లెనిద్ర
పెబ్బేరు రూరల్, ఆగస్టు 21 : టీఆర్ఎస్ సర్కార్ దళితబంధుపై వెనుకడుగేసే ప్రసక్తే లేదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి స్పష్టం చేశారు. మండలంలోని బూడిదపాడు గ్రా మంలో శనివారం పల్లెనిద్ర చేపట్టారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ విపక్షాలు దళితబంధుపై పూటకో మాట చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. ఆరునూరైనా దశలవారీగా అ న్ని కుటుంబాలకు దళితబంధు అందజేసేందుకు ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. 70 ఏండ్ల ప్రగతిని ఏడేండ్లలో సాధించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. రూ.16 వేల కోట్లతో రుణమాఫీ, రూ.7,360 కోట్లతో రైతుబంధు సాయం, రూ.1,400 కోట్లతో రైతుబీమా, 1.31 లక్షల ఉద్యోగాల భర్తీ ప్రభుత్వ పనితీరుకు మచ్చుతునకలని చెప్పారు. జిల్లాలో 600 పడకల దవాఖానతోపాటు మెడికల్ కాలేజీ పనులు త్వరలో ప్రారంభమవుతాయన్నారు. బూడిదపాడు గ్రామ సమస్యలు తీరుస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే అబ్ర హం మంత్రి నిరంజన్‌రెడ్డిని కలిశారు.
రెండు కోట్ల ఉద్యోగాలు ఎక్కడ మోడీ..?
బీజేపీ ప్రభుత్వం రెండు కోట్ల ఉద్యోగాలను భర్తీ చే స్తామని ఇచ్చిన మాట మరిచిందని మంత్రి అన్నారు. నల్లధనాన్ని వెలికితీసి ప్రతి ఖాతాదారుడికి రూ.పది ల క్షలు పంచుతామని చెప్పిన పీఎం మోడీ మోసం చేశార ని విమర్శించారు. ఆయన హయాంలో ఎప్పుడూ ఎరగని విధంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయని ఆరోపించారు. కార్యక్రమంలో ఎంపీపీ శైలజ, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్యామల, సర్పంచ్ భాగ్యమ్మ, నాయకు లు వెంకటేశ్, జగన్నాథం, శివారెడ్డి, రాములు, గోవిందునాయుడు, భారతి, బాల్‌రాం, మహేశ్వర్‌రెడ్డి ఉన్నారు.
బలవర్ధకమైన ఆహారమే గొప్పసంపద..
పాన్‌గల్, ఆగస్టు 21 : భావితరాలకు బలవర్ధకమైన ఆహారాన్ని అందించడమే గొప్ప సంపద అని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని కొత్తపేట గ్రామంలో ఉన్న తన వ్యవసాయ క్షేత్రంలో తేనెటీగల పెంపకంపై అభ్యుదయ రైతులకు ఎమ్మెల్యే ఆల వెం కటేశ్వర్రెడ్డితో కలిసి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి రో జురోజుకూ ప్రాధాన్యత పెరుగుతుందన్నారు. ఏడేండ్ల లో దేశంలో ఎక్కడా లేని పథకాలను సీఎం కేసీఆర్ ప్ర వేశపెట్టారన్నారు. వ్యాపారవేత్తలకు రూ.6 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసిన కేంద్ర పాలకులు, రైతులకు ఏ మాత్రం సాయం చేయడంలేదన్నారు. సంప్రదాయ పం టలకు బదులు నూనె గింజలు, వేరుశనగ, కొబ్బరితోటలు తదితర వైవిధ్యమైన పంటలను సాగుచేయాలని రైతులకు సూచించారు. తేనెటీగల పెంపకంతో అధిక దిగుబడులు సాధ్యమన్నారు. ప్రపంచంలో ఎక్స్పైరీ లే ని ఏకైక వస్తువు తేనె మాత్రమేనని తెలిపారు. ప్రధానం గా తేనె, పీనట్ బట్టర్ లేకుండా పాశ్చాత్య దేశాల్లో ఆహారమే లేదన్నారు. యాసంగిలో వేరుశనగ సాగు విస్తరించాలన్నారు. లావణ్య సేంద్రియ వ్యవసాయమే అందరికీ ఆదర్శమని తెలిపారు. సాధారణ మహిళ రైతుగా మారి స్వయంగా తన పేరుమీదే సేంద్రియ ఉత్పత్తులు విక్రయిస్తుండడం విశేషమన్నారు. అనంతరం ఎమ్మెల్యే ఆల మాట్లాడుతూ 14 ఎకరాల్లో ఆయిల్‌పాం సాగు చేశానన్నారు. రైతులు ఇతర పంటల వైపు దృష్టి సారించాలన్నారు. సమావేశంలో ఉద్యాన శాఖ డైరెక్టర్ వెంకట్రాంరెడ్డి, ఆయిల్‌ఫెడ్ జీఎం సురేందర్‌రెడ్డి, జెడ్పీ చై ర్మన్ లోకనాథ్‌రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్‌రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ విష్ణువర్ధన్‌రెడ్డి, రైతుబం ధు సమితి మండలాధ్యక్షుడు వెంకటయ్యనాయుడు, టీఆర్ఎస్ నాయకుడు చంద్రశేఖర్‌నాయక్, అధికారులు సుధాకర్‌రెడ్డి, సత్యనారాయణరెడ్డి, సురేందర్‌రెడ్డి, ఏవో అనిల్‌కుమార్, ప్రజాప్రతినిధులు, రైతులు ఉన్నారు.
మరింత వేగంగా విద్యుత్ పనులు..
వనపర్తి రూరల్, ఆగస్టు 21 : విద్యుత్ పరికరాల యూనిట్ కేంద్రం ఏర్పాటుతో పనులు మరింత వేగం గా చేసే వీలు ఉంటుందని మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపా రు. శనివారం జిల్లా కేంద్రంలోని విద్యుత్ స్టోర్ రూంలో కాసారాల యూనిట్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రానున్న రోజుల్లో మరింతగా విద్యుత్ పరికరాల ఉత్తత్పి చేసేలా చర్యలు చేపడుతామన్నారు. నాగవరంతండాలో మూడెకరాల ప్రభుత్వ స్థలాన్ని విద్యుత్ స్టోర్‌రూంకు కేటాయించామ ని, పనులు త్వరగా చేపట్టాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అంకిత్, మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, వైస్ చైర్మన్ శ్రీధర్, విద్యుత్ ఎస్ఈ నాగేంద్రకుమార్, డీఈ నరేంద్రకుమార్, కౌన్సిలర్లు సత్యంసాగర్, లక్ష్మీనారాయణ, టీఆర్ఎస్ నాయకులు శ్రీను, రఘువర్ధన్‌రెడ్డి, సంపత్‌కుమార్‌రెడ్డి, తిరుమల్, రమేశ్, మహేశ్, విష్ణుసాగర్, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.
పేదలకు ప్రభుత్వం అండ..
వనపర్తి, ఆగస్టు 21 : పేదలకు ప్రభుత్వం ఎల్లప్పు డూ అండగా ఉంటుందని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. శనివారం వనపర్తిలోని తన క్యాంపు కార్యాలయం లో నియోజకవర్గ పరిధిలో లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం లబ్ధిదారులతో కలిసి టిఫిన్ చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్ నా గన్నయాదవ్, మాజీ కౌన్సిలర్ శ్యాం, నాయకులు జ హంగీర్, రాము తదితరులు పాల్గొన్నారు.