పోలీస్ హౌసింగ్‌బోర్డు మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్‌కుమార్
వనపర్తి జిల్లా నూతన పోలీస్ కార్యాలయ పనుల తనిఖీ
వనపర్తి, ఆగస్టు18: జిల్లా కేంద్రంలోని మర్రికుంట సమీపంలో నిర్మాణంలో ఉన్న పోలీస్ కార్యాలయాల సముదాయ భవనాల నిర్మాణాలను త్వరగా పూర్తి చేసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర పోలీసు హౌసింగ్ మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్కుమార్జైస్ హౌసింగ్ అధికారులు, గుత్తేదార్లను ఆదేశించారు. డిసెంబర్ నాటికి పనులన్నీ పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉండాలన్నారు. ఎస్పీ అపూర్వరావు, చీఫ్ ఇంజినీర్ వియ్కుమార్తో కలిసి నూతన పోలీస్ కార్యాలయం, సాయుధ దళ కార్యాలయం, ఎస్పీ రెసిడెన్సీ, ఎస్పీ క్యాంప్ ఆఫీస్ కార్యాలయాలను బుధవారం సందర్శించారు. మార్పు, చేర్పులపై హౌసింగ్ అధికారులకు, గుత్తేదార్లకు సూచనలు చేశారు. త్వరగా పూర్తి చేసేందుకు ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఎస్పీకి సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ షాకీర్‌హుస్సేన్, పోలీస్ హౌసింగ్ చీఫ్ ఇంజినీర్ విజయ్‌కుమార్, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.