తెలంగాణలో బీఆర్ ఆశయాలు అమలు
ఆయన జీవితాన్ని అధ్యయనం చేయాలి
బీఆర్ రాసిన ఆర్టికల్-3తోనే ప్రత్యేక రాష్ట్రం సాధ్యమైంది
సాగునీటి కొరత రాకుండా కేఎల్ఐ పంపులన్నీ నడపాలి
వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి
వనపర్తి, ఆగస్టు29 (నమస్తే తెలంగాణ)/పెద్దమందడి: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసిన ఆర్టికల్-3 మేరకే తెలంగాణ సాధించుకున్నామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఆదివారం వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈసందర్భం గా మాట్లాడుతూ బీఆర్ ప్రపంచంలో మేధావిగా గుర్తించబడ్డ వ్యక్తి అన్నారు. ఆయన ఆశయాలు దేశంలోని ఏ రాష్ట్రం లో అమలు కావడంలేదని, ఒక్క తెలంగాణలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రం లో గురుకుల పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటు చేసి పేదలకు మెరుగైన విద్య ను అందిస్తున్నామన్నారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎక్కడైనా మన రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు ఉన్నాయా అన్నారు. కాంగ్రెస్ పాలనలో అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చలేదని దుయ్యబట్టారు. అంబేద్కర్ ఆశయాలను అధ్యయనం చేసి ఆయన అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. అంతకుముందు జిల్లాకేంద్రంలోని మంత్రి నివాసంలో నీటిపారుదలశాఖ అధికారులతో ఎంజీకేఎల్, డీ-8 కాలువపై నిరంజన్‌రెడ్డి సమీక్ష చేశారు. రైతులకు సరిపడా నీరు వచ్చేలా పంపులన్నింటినీ నడిపించాలని ఆదేశించారు. పూర్తిస్థాయిలో సాగునీరు అందేలా చూడాలన్నారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్‌రెడ్డి, ఎంపీపీ మెఘారెడ్డి, జెడ్పీటీసీ రఘుపతిరెడ్డి, స్థానిక సర్పంచ్ సిద్ధయ్య, మాజీ జెడ్పీటీసీ కొమ్ము వెంకటస్వామి, మాజీ ఎంపీపీలు దయాకర్, మన్యపురెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మారెడ్డి, మాజీ చైర్మన్ ఎత్తం రవి, ఉప సర్పంచ్ గోవర్ధన్‌రెడ్డి, ఎంపీటీసీ ఇందిరమ్మ, ఎస్సీ సెల్ నాయకులు కోళ్ల వెంకటేశ్, సురేశ్, ఆనంది, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వేణుయాదవ్, నాయకుడు మహేశ్ పాల్గొన్నారు.
సాగునీటి కొరత రానివ్వొద్దు
పంట పొలాలకు పూర్తిస్థాయిలో నీరందేలా చూడాలని, సాగునీటికి కొరత రానివ్వొద్దని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని మంత్రి నివాసంలో నీటిపారుదలశాఖ అధికారులతో ఆదివారం ఎంజీకేఎల్ఐ, డీ8 కాలువపై సమీక్ష చేశారు. రైతులకు సరిపడా నీరు వచ్చేలా ఎంజీకేఎల్ఐలోని పంపులన్నింటినీ నడిపించాలని సూచించారు. డీ-8 కాలువ పరిమాణం 2700 క్యూసెక్కులు ఉండగా కేవలం 1300 క్యూసెక్కులు మాత్రమే వస్తున్నాయని పేర్కొన్నారు. డీ8 కాలువ పనులు వెంటనే పూర్తికావాలన్నారు. దీనిపరిధిలో ఎంజీ-1 కాలువ మరమ్మతులు చేపట్టి 15 రోజుల్లో ఆయకట్టుకు నీరు అందించాలని సూచించారు. ఎంజీ-3 పరిధిలో ఉన్న 200మీటర్ల కాలువ తవ్వకం పెండింగ్ పనులు పూర్తిచేసి చెన్నారం వరకు నీళ్లు అందించాలని ఆదేశించారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులకు సంబంధించి పెండింగ్ పనులపై మధుకాన్ మేనేజర్‌పై మంత్రి సీరియస్ అయ్యారు. అదేవిధంగా గోపాల్పేట మండలంలో కొన్ని ప్రాంతాలకు కాలువలు లేకపోవడం వల్ల సాగునీరు అందడం లేదని కొత్త కాలువకు సర్వే చేయాలని అధికారులకు సూచించారు. సమావేశంలో ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ మధుసూదన్‌రావు, డీఈలు ఎల్లస్వామి, వెంకటరమణమ్మ, మధుకాన్ మేనేజర్ వెంకట్రావు, గోపాల్పేట రైతుబంధు సమితి అధ్యక్షుడు తిరుపతయ్య యాదవ్, చెన్నారం సర్పంచ్ రమేశ్, రాజు, స్వామిరెడ్డి పాల్గొన్నారు.