ఆత్మకూరు, ఆగస్టు 20 : ఉమ్మడి మండల వ్యాప్తంగా మొహర్రం వేడుకలను ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. ఆయా గ్రామాల్లో సంప్రదాయం ప్రకారం పీర్లను ఊరేగించారు. పీర్లకు దట్టీలు కట్టి కానుకలు సమర్పించారు. మహిళలు బొడ్డెమ్మలు వేస్తూ, యువకులు నృత్యాలు చేస్తూ వేడుకలకు మరింత జోష్‌ను తీసుకొచ్చారు. అమరచింతలో జరిగిన మొహర్రం వేడుకలకు ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి హాజరయ్యారు. నిమజ్జనోత్సవానికి ముందు పీర్ల చావిడీలో కొలువుదీరిన పీర్లకు ఎమ్మెల్యే కానుకలు సమర్పించి ప్రార్థనలు జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుల, మతాలకతీతంగా పీర్ల పండుగ జరుపుకోవడం హర్షనీయమన్నారు. ఈ సందర్భంగా ముజావర్ల విన్నపం మేరకు పీర్ల చావిడీ అభివృద్ధికి సహకరిస్తానని ఎమ్మెల్యే హామీఇచ్చారు. కార్యక్రమంలో అమరచింత మున్సిపల్ చైర్పర్సన్ మంగమ్మగౌడ్, వైస్‌చైర్మన్ గోపి, ఆత్మకూరు ఎంపీపీ శ్రీనివాసులు, చైర్పర్సన్ గాయత్రీయాదవ్, వైస్ చైర్మన్ విజయభాస్కర్‌రెడ్డి, కమిషనర్ రమేశ్, మార్కెట్ వైస్‌చైర్మన్ నాగభూషణంగౌడ్, మాజీ ఎంపీపీ శ్రీధర్‌గౌడ్, ఉమ్మడి మండల్లాల పార్టీ అధ్యక్షులు రవికుమార్‌యాదవ్, రమేశ్, టీఆర్ఎస్వీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నరేశ్‌రెడ్డి, నాయకులు రాజు, రఫీక్, మోహన్‌రెడ్డి, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.
పెబ్బేరు మండలంలో..
పెబ్బేరు రూరల్, ఆగస్టు 20 : పెబ్బేరు మండలంలో శుక్రవారం ఘనంగా మొహర్రం వేడుకలు జరిగాయి. కుల మతాలకతీతంగా ప్రజలు పెద్ద ఎత్తున ఉత్సవాల్లో పాల్గొన్నారు. భక్తులు పీర్లచావిళ్ల వద్దకెళ్లి పీర్లకు నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మండలంలోనే అత్యం త వైభవంగా నిర్వహించే పాతపల్లిలో భక్తజనం పోటెత్తారు. సర్పంచ్ రవీందర్‌నాయుడు పలు సౌకర్యాలు కల్పించారు. గ్రామ వీధుల్లో పెద్ద ఎత్తున పీర్ల ఊరేగింపు నిర్వహించారు.
కొత్తకోటలో..
కొత్తకోట, ఆగస్టు 20 : మొహర్రం పండుగను పట్టణంతోపాటు వివిధ గ్రామాల్లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కొత్తకోట, రాయినిపేట, పామాపురం, రామకిష్టాపురం గ్రామాల్లో పీర్ల చావిడీ నెలకొల్పిన పీర్లను ఊరేగించారు. రాయినిపేట గ్రామంలో సర్పంచుల సంఘం మం డలాధ్యక్షుడు శ్రీనివాసులు, రామకిష్టాపురం గ్రామంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్ పర్సన్ రాజేశ్వరమ్మ, మార్కెట్ డైరెక్టర్ వెంకటేశ్వర్‌రెడ్డి, భీంరెడ్డి కుటుంబ సమేతంగా పీర్లను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. మొహర్రం పండుగ సందర్భంగా గాడ్స్ ఆన్ వారియర్స్ షోటోకాన్ కరాటే అకాడమీ వారి ఆధ్వర్యంలో భక్తులకు శర్బత్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు రాములుయాదవ్, ఖాజామైనొద్దీన్, నాయకులు సాజద్అలీ, ఎండీ కైసర్, ఇంతియాజ్, వహీద్, రషీద్ పాల్గొన్నారు.
వనపర్తిలో..
వనపర్తి టౌన్, ఆగస్టు 20 : జిల్లా కేంద్రంలో శుక్రవారం ఘనంగా మొహర్రం పండుగను నిర్వహించారు. పీర్లగుట్ట, గాంధీచౌక్, పోచమ్మ గుడి ప్రాంతంలో మొహర్రం పండుగను జరుపుకున్నారు. నవరాత్రులు పూజలు అందుకొని శుక్రవారం నిమజ్జనానికి పీర్లు బయల్దేరాయి. భక్తులు పీర్లకు దట్టీలు, మాలీజా ముద్దలను పీర్లకు నైవేద్యంగా సమర్పించి మొక్కలు సమర్పించుకున్నారు. మొహర్రం పండుగను పురస్కరించుకొని మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్ తన నివాసంలో సంబురాలను ఘనంగా జరుపుకొన్నారు. వనపర్తి పట్టణం సుభిక్షంగా ఉండాలని, ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో గడపాలని, మంత్రి నిరంజన్‌రెడ్డి నాయకత్వంలో వనపర్తి పట్టణంలో రాష్ట్రంలో ఆదర్శ మున్సిపాలిటీగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, మాజీ చైర్మన్ రమేశ్‌గౌడ్, కౌన్సిలర్లు లక్ష్మీనారాయణ, పాషా, నారాయణ, జంపన్న, సత్యంసాగర్, తిరుమల్, మైనార్టీ నాయకులు షేక్ జహంగీర్, గులాంఖాదర్, బాబుమియా, రహీం, నాయకులు శశిభూషన్, రామకృష్ణ పాల్గొన్నారు.
చిన్నంబావిలో..
చిన్నంబావి, ఆగస్టు 20 : మండలంలోని పెద్దమరూరు, చెల్లెపాడు, కొప్పునూరు, లక్ష్మిపల్లి, బెక్కెం, గడ్డబస్వాపురం, గూడెం గ్రామాల్లో భక్తులు పీర్లను దర్శించుకొని నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామాల్లో పీర్లను ఊరేగించి నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు.
ఖిల్లాఘణపురంలో..
ఖిల్లాఘణపురం, ఆగస్టు 20 : మండల కేంద్రంతోపాటు మండలంలోని కమాలుద్దీన్‌పూర్, ఆగారం, వెంకటాంపల్లి, సోలీపూర్, మానాజీపేట, షాపూర్, పర్వతాపూర్, సల్కలాపూర్, అప్పారెడ్డిపల్లి, అల్లామాయిపల్లి, తిరుమలాయపల్లి, మల్కినియాన్‌పల్లి తదితర గ్రామాల్లో మొహర్రం పండుగను ప్రజలు ఘనంగా జరుపుకొన్నారు. తొమ్మిదిరోజులపాటు కొలువుదీరిన పీర్లు శుక్రవారం నిమజ్జనానికి బయల్దేరి వెళ్లాయి. కమాలుద్దీన్‌పూర్‌లో పీర్ల పండుగలో వనపర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మీరెడ్డి పాల్గొన్నారు.
పెద్దగూడెంలో..
వనపర్తి రూరల్, ఆగస్టు 20 : మండలంలోని పెద్దగూడెంలో పీర్ల వేడుకలు కన్నుల పండువగా కొనసాగాయి. మండలంలోని పెద్దగూడెం, కడుకుంట్ల, సవాయిగూడెం, అప్పాయిపల్లి గ్రామాల్లో మొహర్రం వేడుకలను ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు.
పాన్గల్లో..
పాన్‌గల్, ఆగస్టు 20 : భిన్నత్వంలో ఏకత్వంగా ప్రతిబింబించే మోహర్రం పండుగను పురస్కరించుకొని శుక్రవారం మండలంలోని వివిధ గ్రామాల్లోని ప్రజలు ఘనంగా జరుపుకొన్నారు. ఆయా గ్రామాల పీర్ల చావిడీ దగ్గర భక్తులు ప్రార్థనలతోపాటు పూలమాలలు, తీర్థప్రసాదాలు సమర్పిం చి మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో ముస్లీం సోదరులు, ప్రజలు పాల్గొన్నారు.
శ్రీరంగాపూర్లో..
శ్రీరంగాపూర్, ఆగస్టు 20 : మండలంలోని అన్ని గ్రా మాల్లో మొహర్రం పండుగ ఘనంగా జరుపుకొన్నారు. కుల మతాలకతీతంగా గ్రామ పెద్దలు, యువకులు చిన్నారులు అలయ్‌బలయ్ అడుతూ వీధుల గుండా పీర్ల ఊరేగింపు చేశారు. మొహర్రం పండుగ చివరి రోజు శుక్రవారం ముస్లిం సోదరుల ప్రత్యేక ప్రార్థనలతో భక్తులు మొక్కులు తీర్చుకున్నారు.
మదనాపురంలో..
మదనాపురం, ఆగస్టు 20 : మండలంలోని తిర్మలాయపల్లి, రామన్‌పాడు, అజ్జకొల్లు, కొన్నూరు, దుప్పల్లి, గోపన్‌పేట గ్రామాల్లో కులమతాలకు అతీతంగా ప్రజలు మొహ ర్రం వేడుకల్లో పాల్గొన్నారు. శుక్రవారం గ్రామాల్లో పీర్లను ఊరేగించారు.
రేవల్లిలో..
రేవల్లి, ఆగస్టు 20 : మండలంలోని ప్రజలు శుక్రవారం పీర్ల పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకొన్నారు. అలాయి, బొడ్డెమ్మలు, కోలాటాలు ఆడుతూ, డప్పుల దరువులతో నృ త్యాలు చేసుకుంటూ పీర్లను ఊరేగించారు. భక్తులు పీర్లకు దట్టీలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ భీమయ్య, ఎంపీపీ సేనాపతి గ్రామస్తులుకు మొహర్రం పండుగ శుభాకాంక్షలు తెలిపారు.