వనపర్తి, అక్టోబర్ 3: ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ జెండాను పట్టుకున్న సమయంలో నవ్వి నా , మానసికంగా ఎన్నో అవమానాలను సం తోషంగా స్వీకరించి స్వరాష్ట్ర సాధనకు పోరాడిన ముఖ్యవక్తుల్లో తన దైన ముద్ర వేసుకున్న వ్యక్తి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. వనపర్తి పట్టణం నుంచి వరంగల్ సైకిల్‌యాత్రలో పాల్గొని స్వయంగా సైకిల్ తొక్కుకుంటూ వెళ్లి తెలంగాణ వాదాన్ని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అందరిలో నింపుతూ ఉద్యమంలో ఒక్కడిలా నిలిచిన వ్యక్తి. రాష్ట్రం ఏర్పడిన తరువాత నియోజకవర్గంలో ప్రజల తీర్పును సాదారంగా ఆహ్వానించి సీఎం కేసీఆర్ అప్పగించిన రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష పదివిని స్వీకరించిన సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి నిత్యం ప్రజల సంక్షేమం కోసం పాటుపడడంతో 2018 ఎన్నికల్లో నియోజకవర్గం చరిత్రలో ఏ రాజకీయ నాయకుడిని రాని భారీ మెజార్టీతో ప్రజలు గెలిపించారు. ఎమ్మెల్యేగా, అనంతరం మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న ప్రతి పథకాన్ని ప్రజలకు చేరేలా కృషి చేస్తున్నారు. ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి పల్లె పల్లె, వాడ వాడ తిరుగుతూ సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకుంటూ వాటి పరిష్కార దిశగా అడుగులు వేస్తున్నా మంత్రి నిరంజన్‌రెడ్డి.
పల్లెల్లో ఆనందం
గత పాలకుల నిర్వాహకంతో పాలమూరు వాసులు ఇతర ప్రాంతాలకు పొట్టచేత పట్టుకొని అన్నమో రాంచంద్ర అంటూ వలసలు వెళ్లేవారు. అన్నం వడ్డించే వాడు మనవాడు అయితే చివరన ఉన్న మనకు దక్కుతుందన్న పెద్దలు అన్న సామెతకు నిదర్శనం మన తెలంగాణ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి. వ్యవసాయ పొలాలకు సాగునీరు లేక ఇతర ప్రాంతాలకు పనులు లేక ఉపాధి కోసం వలసలు వెళ్తున్న ప్రజల కష్టాలను తెలుసుకొని ప్రజల బాధలను ఏ విధంగానైనా తీర్చాలనే ప్రయత్నాన్ని ప్రారంభించారు. పొలాలకు సాగునీరును అందిస్తూ ప్రజల కళ్లలో ఆనందం చూస్తున్నారు. ప్రజల కష్టాలు తీరే సమయం ఆసన్నమైందని తెలంగాణ ప్రజలు ఇతర ప్రాంతాల వారికి పనులు కల్పించే దశకు చేరుకోవాలనే సంకల్పంతో సాగునీటి కాలువ పనులను వేగవంతం చేస్తున్నారు. ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లకుండా తల్లీబిడ్డా, భార్యభర్త, కుటుంబమంతా కలిసి గ్రామల్లోనే జీవనోపాధి పొందేలా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను కల్పిస్తున్నది. నూతన రిజర్వాయర్ల నిర్మాణం, పరిశ్రమల స్థాపన, విద్య, ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నది.
జన్మదినం సందర్భంగా కార్యక్రమాలు
మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి జన్మదినం సందర్భంగా ప్రతి నాయకుడు పూల బొకేలు ఇతర కార్యక్రమాలకు ఖర్చు పెట్టకుండా ప్రతి పేద వి ద్యార్థికి తన వంతుగా నోట్ పుస్తకాలను అందజేయాలని మంత్రి నిరంజన్‌రెడ్డి సూచించారు. మంత్రి సూచనల మేరకు నియోజకవర్గంలో ప్రతి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు ఉ చితంగా నోట్ పుస్తకాలను పంపిణీ చేయనున్నా రు. అంతకుముందు నియోజకవర్గంలోని ప్రతి ప్రభుత్వ దవాఖానలో రోగులకు పండ్లు, బ్రెడ్ల పంపిణీతోపాటు జిల్లాకేంద్రంలోని దాచె లక్ష్మయ్య ఫంక్షన్హాల్లో మెగా రక్తదాన శిబిరాన్ని నాయకులు నిర్వహించనున్నారు.
నిరంజన్‌రెడ్డి హయాంలో అభివృద్ధి
నియోజకవర్గంలో దాదాపు 60 మినీఎత్తిపోతల పథకాలను పెట్టి దాదాపు 5,550 ఎకరాల బీడు భూములను సస్య శ్యామలం చేశారు. రూ.6 కోట్లతో మరో నాలుగు మినీ ఎత్తిపోతల పథకాలను ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా ఏదుల రిజర్వాయర్ ఏడాదిన్నరలో పూర్తి చేశారు.
రూ.107 కోట్లతో పెబ్బేర్‌లో మత్స్య కళాశాలను తీసుకువచ్చారు. పీయూ నుంచి వనపర్తిలో పీజీ సెంటర్, ఐటీఐ కళాశాల ఏర్పాటు, పెబ్బేర్ డిగ్రీ కళాశాల ఏర్పాటు, రేవల్లిలో కస్తూర్బా పాఠశాల, బీసీ గురుకుల పాఠశాల ఏర్పాటు చేయించారు. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో 100 నుంచి150 పడకలకు పెంచారు. రూ.22కోట్లతో 150 పడకల ఆధునిక మాతా శిశు సంరక్షణ కేంద్రం నిర్మాణం. జిల్లా దవాఖానలో డయాలసిస్ కేంద్రంలో 5 యూనిట్లు ఉండగా, మరో 5యూనిట్లను పెంచి ఎంతో కిడ్నీ బాధితులకు అండగా నిలుస్తున్నారు.నియోజకవర్గంలో 181 కిలోమీటర్ల రహదారులకుగానూ రూ.17,082.99 లక్షల వ్యయంతో నిర్మించారు. అదేవిధంగా వనపర్తి, గోపాల్పేట, ఘణపురం మండలాలల్లో రూ.7.12 కోట్లతో 11.80 కిలోమీటర్ల 5 రహదారులను నిర్మించారు.
చిట్యాల సమీపంలో 42 ఎకరాలలో రూ.44 కోట్లతో నూతన వ్యవసాయ మార్కెట్‌ను నిర్మించారు. పాత వ్యవసాయ మార్కెట్లో 1,2 ఎకరాలను కేటాయించి రూ.19 కోట్లతో సమీకృత మార్కెట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఎకో పార్కు సమీపంలో రూ. 2.65 కోట్లతో మార్కెట్ నిర్మాణం చేయనున్నారు. రూ 53 కోట్లతో నూతన కలెక్టరేట్ భవన నిర్మాణం, వీరాయపల్లిలో 34 ఎకరాలలో వేరుశనుగ కేంద్రం, రూ 70 కోట్లతో వేర్‌హౌసింగ్ గోదాముల నిర్మాణం పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.నియోజకవర్గంలో 2825 ఇండ్లు డబుల్ బెడ్రూం కేటాయించగా 1400 ఇండ్లను ఇప్పటికే లబ్ధ్దిదారులకు అందజేశారు.