
ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి
పరిగి, ఆగస్టు 29 : క్రీడలతో మానసికోల్లాసంతో పాటు గుర్తింపు లభిస్తుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా పరిగిలోని ఇండోర్ స్టేడియంలో ఆదివారం యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి మాట్లాడుతూ చిన్నప్పటి నుంచే క్రీడల్లో సాధన చేయాలని, అంతర్జాతీయ, జాతీయ స్థాయికి ఎదిగిన క్రీడాకారులకు చక్కటి గుర్తింపు రావడంతోపాటు ఉద్యోగావకాశాలు లభిస్తాయని ఎమ్మెల్యే చెప్పారు. ఇటీవల జరిగిన ఒలంపిక్స్‌లో పలు రంగాలలో పతకాలు సాధించిన అనేక మంది దేశంతోపాటు తమ ప్రాంతానికి చక్కటి పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చారని అన్నారు. దేశం తరఫున గర్వించదగిన వారిని ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. క్రీడలను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సందర్భంగా మేజర్ ధ్యాన్‌చంద్ చిత్రపటానికి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
రక్షాబంధన్, శ్రీ కృష్ణాష్టమి వేడుకలను బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వ విద్యాలయం ఆధ్వర్యంలో పరిగిలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రక్షాబంధన్ విశిష్టతను మధురానగర్ కేంద్రం ఇన్చార్జి లక్ష్మి వివరించారు. అనంతరం ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి, ప్రజాప్రతినిధులకు ఆమె రాఖీ కట్టారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి హన్మంత్‌రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎ.సురేందర్, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, జడ్పీటీసీ బి.హరిప్రియ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఆర్.ఆంజనేయులు, టీఆర్ఎస్ నాయకుడు బి.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ ఎస్.భాస్కర్, క్రీడాకారులు, పరిగి కేంద్రం ఇన్చార్జి పద్మ పాల్గొన్నారు.