
జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో 75 పార్కులు
‘పట్టణ ప్రగతి’లో భాగంగా పార్కుల అభివృద్ధి
ప్రైవేటు లే అవుట్లలోని ఖాళీ స్థలాల్లోనూ నిర్మాణం
చకచకా సాగుతున్న పనులు
ప్రత్యేకంగా వాకింగ్ ట్రాక్‌లు, బెంచీల ఏర్పాటు
చిన్నారులు ఆడుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు
పార్కుల అభివృద్ధిపై హర్షాతిరేకాలు
రాష్ట్ర ప్రభుత్వం ‘పల్లె ప్రగతి’తో ప్రతి పల్లెలో పల్లె ప్రకృతి వనాలను నిర్మించిన విషయం తెలిసిందే. మున్సిపాలిటీల్లోనూ ‘పట్టణ ప్రగతి’ కార్యక్రమంలో భాగంగా ప్రతి కాలనీలో పార్కులను ఏర్పాటు చేసి అభివృద్ధి చేస్తున్నది. వికారాబాద్ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో తొలి విడుతలో 75 పార్కుల అభివృద్ధికి అధికారులు శ్రీకారం చుట్టారు. కొత్తగా వెలసిన కాలనీల్లోనూ చక్కటి వాతావరణం నెలకొనేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రైవేటు లే అవుట్లలోని ఖాళీ స్థలాన్ని మున్సిపాలిటీలకు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తుండగా, పచ్చని పార్కులను నిర్మిస్తున్నది. ప్రజల ఆరోగ్యం కోసం వాకింగ్ ట్రాక్‌లు, సేదతీరేందుకు బెంచీలు, చిన్నారుల కోసం ఆట వస్తువులను పార్కుల్లో ఏర్పాటు చేస్తున్నారు. పట్టణాల్లోని ప్రతి కాలనీలో పార్కులను అభివృద్ధి చేస్తుండటంతో పట్టణవాసుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
పరిగి, ఆగస్టు 29: పట్టణాలు కాంక్రీట్ జం గళ్లు అనే భావనను తొలిగించి కాలనీల్లో ప్రత్యేకంగా పార్కులు ఏర్పాటు చేస్తుండడంతో పచ్చందాలతో కళకళలాడుతున్నా యి. కొత్తగా వెలిసిన కాలనీల్లో పార్కులు ఏర్పాటుచేసి అభివృద్ధి చేయడంతో చక్కటి వాతావరణం నెలకొంటున్నది. ఉదయం, సాయంత్రం సమయాల్లో పార్కుల్లో వాకిం గ్ చేయడంతోపాటు సేద తీరడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. తమ కాలనీల్లోనే పార్కులు ఏర్పాటు చేస్తుండడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొద టి విడుతలో వికారాబాద్ జిల్లాలోని నాలు గు మున్సిపాలిటీల్లో ఉన్న 75 పార్కులను అభివృద్ధి చేయడానికి సంకల్పించారు. ఇందులో భాగంగా జిల్లాలోని ఆయా మున్సిపాలిటీల్లో పార్కుల అభివృద్ధి కొనసాగుతున్నది. కొన్ని పార్కుల్లో పనులు తు ది దశకు చేరుకోగా, మరికొన్నింటిలో కొనసాగుతున్నాయి. సాధ్యమైనంత త్వరగా వా టిని పూర్తి చేయాలన్నది సర్కారు ఉద్దేశం.
మొదటి విడుతలో 75 పార్కులు
జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో తొలి విడుతలో 75 పా ర్కుల అభివృద్ధికి అధికారులు శ్రీకారం చుట్టారు. గతేడాది నుంచే పార్కుల్లో మొక్కల పెం చుతున్నారు. నాలుగు మున్సిపాలిటీల్లోని 236 లే అవుట్లలో మొ త్తం 288 ఖాళీ స్థలాలు ఉన్నా యి. పరిగిలో 32 లే అవుట్లలో 42 ఖాళీ స్థలాలుండగా 10 పార్కులు, వికారాబాద్‌లోని 164 లే అవుట్లలో 202 ఖాళీ స్థలాలుండగా 55 పార్కు లు, తాండూరులోని 22 లే అవుట్లలో 26 ఖాళీ స్థలాలుండగా 8 పార్కులు, కొడంగల్‌లోని 22 లే అవుట్లలో 26 ఖాళీ స్థలాలుండగా 8 పార్కులను ప్రస్తుతం అభివృద్ధి చేస్తున్నారు. మొక్కలు ఎదిగిన తర్వాత పార్కులో ప్రత్యేకంగా వాకింగ్ ట్రాక్‌లు నిర్మిస్తున్నారు. సేద తీరడానికి ప్రత్యేకంగా బెంచీలు ఏర్పాటు చేస్తున్నారు. పార్కులు సుందరంగా కనిపించేందుకు పూలమొక్కలు నాటారు. పిల్లలు ఆడుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆహ్లాదకరమైన వాతావరణం
ప్రైవేటు లే అవుట్లలో 10శాతం భూమిని సంబంధిత మున్సిపాలిటీలకు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలి. ఈ స్థలంలో ఆయా కాలనీవాసులందరికీ ఉపయోగపడే విధంగా నిర్మాణాలు చేపట్టడంతోపాటు పార్కులు ఏర్పాటు చేస్తారు. పట్టణాలను సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం పట్టణ ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ప్రైవేటు లే అవుట్లలోని ఖాళీ స్థలాల్లో పార్కుల అభివృద్ధికి నడుం బిగించింది. మొదటి విడుతలో కొన్ని పా ర్కుల అభివృద్ధి పనులు చేపట్టారు. విడుత ల వారీగా అన్ని లే అవుట్లలో పార్కులు ఏర్పాటు చేయనున్నారు. కొన్నిచోట్ల పా ర్కుల్లో వాకింగ్ ట్రాక్‌ల నిర్మాణానికి ఏర్పా ట్లు చేస్తున్నారు. దీంతో సాయంత్రం వేళలో సేద తీరడానికి ఉపయోగపడుతాయి.
సుందరంగా తీర్చిదిద్దుతాం
ప్రైవేటు లే అవుట్ల లో గల ఖాళీ స్థలా ల్లో ఏర్పాటు చేస్తు న్న పార్కులను సుందరంగా తీర్చిదిద్దుతాం. మొదటి విడుతలో పార్కుల ఏర్పాటుకు నిర్ణయించిన స్థలాల్లో మొక్క లు నాటాం. చుట్టూ కంచె వేయడంతో మొక్కలు ఏపుగా పెరుగుతున్నాయి. పార్కులో వాకింగ్ ట్రాక్‌ల నిర్మాణం, బెం చీలు ఏర్పాటు చేస్తున్నాం. పూలమొక్కలు నాటాం. పిల్లలు ఆడుకునేందుకు ఏర్పాట్లు చేస్తాం.