పరిగి, సెప్టెంబర్ 5 : మాజీ రాష్ట్రపతి, విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఆదివారం పరిగిలోని ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఉపాధ్యాయ వృత్తి నుంచి రాష్ట్రపతి స్థాయి వరకు ఎదిగిన మహోన్నత వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్ అని కొనియాడారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కొప్పుల అనిల్‌రెడ్డి, ఎంపీపీ కె.అరవిందరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎ.సురేందర్, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఆర్.ఆంజనేయులు, నాయకులు బి.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మంగు సంతోష్‌కుమార్, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయులకు సన్మానం
వికారాబాద్, సెప్టెంబర్ 5 : దేశభవిష్యత్‌ను మార్చే గొప్పతనం ఒక్క ఉపాధ్యాయులకే ఉంటుందని వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ చిగుళ్లపల్లి మంజుల అన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా వికారాబాద్‌లోని శివరాంనగర్ కాలనీలో కౌన్సిలర్ గాయతీలక్ష్మణ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ శంషాద్భేగం, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రమేశ్‌కుమార్, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.
కులకచర్ల ఎంపీడీవో కార్యాలయంలో..
కులకచర్ల, సెప్టెంబర్ 5 : మండల కేంద్రంలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని ఎంపీడీవో కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వేపల్లి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సత్యహరిశ్చంద్ర, వైస్ ఎంపీపీ రాజశేఖర్‌గౌడ్, ఏఎంసీ చైర్మన్ హరికృష్ణ, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు రాజు, దోమ ఎంఈవో హరిశ్చందర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సారా శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు శేరి రాంరెడ్డి, ఆంజనేయులు, మొగులయ్య, బొంబాయి రాములునాయక్, మాలె కృష్ణయ్యగౌడ్, వెంకటయ్యగౌడ్, కృష్ణారెడ్డి పాల్గొన్నారు.